అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ది.. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో …
Read More »చేపల వేటకు వెళ్లాడు.. కట్ చేస్తే.. వల బరువెక్కడంతో సరాసరి నీటిలోకే.. ఆ తర్వాత!
ఆ చేపను బోటులోకి లాగే ప్రయత్నం చేసిన యర్రయ్యను ఆ మత్స్యం బలంగా వెనక్కు లాగింది. దాంతో ఎర్రయ్య తాడుతో సహా సముద్రంలోకి పడిపోయాడు. ఆ సమయం వారంతా తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వేట సాగిస్తున్నారు. అంతలోనే సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. కానీ,అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక లో విషాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్ళిన మత్స్యకారుడిని ఒక చేప లాక్కెళ్ళిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఎర్రయ్య …
Read More »అనకాపల్లి ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన!
అనకాపల్లి జిల్లాలో బాణసంచా పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోటవురట్ల పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించగా..పరిమితికి మించి బాణసంచా ఉండడంతోనే భారీ పేలుడు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 2012 నుంచి ఈ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా..నిన్న జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మంది హాస్పిటల్‌లో చికిత్స …
Read More »2 బల్బులు, టీవీ మాత్రమే ఉన్న గిరిజన గూటికి ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో తెల్సా..?
అనకాపల్లి జిల్లా రావికంధం మండలం టి అర్జాపురం పంచాయతీ శివారు గ్రామమైన డోలవానిపాలెంలో ఎస్టీ ఆదివాసి కొండ దొర గిరిజనులు నివసిస్తారు. సత్తిబాబు అనే వ్యక్తి తన ఇంట్లో అవసరాల కోసం రెండు బల్బులు, ఓ టీవీ మాత్రమే ఉన్నాయి. వాటి కోసం విద్యుత్ వినియోగిస్తూ ఉంటారు. అయితే.. విద్యుత్ రీడింగ్ తీసేందుకు వచ్చిన సిబ్బంది బిల్లు తీసి చేతిలో పెట్టారు. ప్రతి నెల మాదిరిగా వందల్లో వస్తుందని అనుకున్నారు.. కానీ అక్షరాల 1,60,000 కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. …
Read More »ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!
బస్సు డిపోలో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్, అధికారుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు జాడ గుర్తించారు. అయితే, బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకు వచ్చిన ఆ డ్రైవర్‌కు.. అక్కడ ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండాపోయింది. ఇటు అటు చూశాడు. కనిపించలేదు. …
Read More »AP: ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్.. పూజారి పనే
ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి పేలుడు పదార్థాలతో గుడిని పేల్చివేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా …
Read More »విశాఖ: కడుపునొప్పితో వచ్చిన మహిళకు స్కానింగ్.. రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్, వామ్మో ఎలా సాధ్యం
విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు అవాక్కయ్యారు.. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఆమె మందులు వాడారు. ఆ తర్వాత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో …
Read More »మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. క్షతగాత్రులను జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం అధికారులతో మాట్లాడారు.. …
Read More »ఒక్క రోజు ఆగినా ప్రాణం దక్కేది.. కన్నీరు తెప్పిస్తున్న కెమికల్ ఇంజనీర్ హారిక కథ
మృత్యువు.. అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. కటిక పేదరికంలో మగ్గుతున్న వాడైనా.. ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా.. మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఆ మృత్యు దేవతకు కూడా మనసంటూ ఉంటే.. దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక.. గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే …
Read More »అచ్యుతాపురం బాధితులకు చంద్రబాబు పరామర్శ.. వారికి రూ.50లక్షలు, రూ.25 లక్షలు ప్రకటన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలో బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు.. భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.. వారికి ధైర్యం …
Read More »