అమరావతి

తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్‌ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!

ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్‌తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.ఏపీ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, …

Read More »

20 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు.. ఆ వివరాలు ఇలా..ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు …

Read More »

సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్‌కు బూమ్ వచ్చింది. మరి సామాన్యులకు గుడ్ న్యూస్ అందించేలా.. అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..ఏపీలో ఆరునెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బెలూన్‌కు గాలి ఊదినట్లుగా.. ఏపీలో రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలా ఒక్కసారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగి పడిపోతుంది …

Read More »

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు తీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఆసక్తికర ప్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి…సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు, దుష్ప్రచారాలకు, మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని …

Read More »

 చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

రాజధాని కోసం చేసే అప్పులు ఎలా తీరుస్తారు.. దీనిపై జనంలో గాని, అపోజిషన్ పార్టీల్లో గానీ ఉండే అనుమానాలేంటి.. కూటమి సర్కార్ ఇస్తున్న క్లారిటీలేంటి..? ఇదే కాదు.. అమరావతి నిర్మాణంపై ఉండే అన్ని డౌట్లనూ పటాపంచలు చేశారు మంత్రి నారాయణ. సీఆర్‌డీఏ కీలక సమావేశం తర్వాత.. బేఫికర్ అంటూ భరోసానిచ్చారు..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక …

Read More »

నిరుద్యోగ యువత కోసం ‘ట్రెయిన్‌ అండ్‌ హైర్‌’ ప్రోగ్రామ్‌.. ఉచితంగా శిక్షణతోపాటు ఉద్యోగం కూడా!

నిరుద్యోగ యువతకు కూటమి సర్కార్ వినూత్న ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. ఉచితం శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కూడా కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ప్రారంభంకాగా.. మరికొన్ని చోట్ల అవసరం మేరకు యూనివర్సిటీలు, కాలేజీల నుంచి స్థలాలను సేకరించే పనిలో పడింది..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితవ్యం కోసం విశేషంగా కృషి చేస్తుంది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించేందుకు ‘ట్రెయిన్‌ అండ్‌ హైర్‌’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి …

Read More »

అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..

అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్‌ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై …

Read More »

పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు …

Read More »

అసభ్యకర పోస్టులపై చంద్రబాబు సర్కార్ సీరియస్.. ఇక నుంచి మామూలుగా ఉండదు..

సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు తీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతోంది.సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, నేరస్థుల ప్రవర్తన, …

Read More »

పోటీపడండి.. హార్డ్ వర్క్‌ కాదు స్మార్ట్‌ వర్క్‌ చేయండి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

కొన్ని సూచనలు.. ఇంకొన్ని సలహాలు.. మరికొన్ని బాధ్యతలు గుర్తుచేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్‌ కాదూ.. స్మార్ట్‌గా దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం..గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బియ్యం మాఫియా పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం, గంజాయ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం …

Read More »