ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకావం ముమ్మరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి ముగియనుంది. అయితే ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనే దానిపేఐ క్లారిటీ లేదు. ఒకవేళ రిటైర్ మెంట్ తీసుకుంటే తర్వాత ఆ పోస్టులో ఎవరుంటారనే దానిపై చర్చసాగుతుంది..కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం …
Read More »ఇక ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ షురూ.. ఏఐ, డీప్ టెక్‌లతో పౌర సేవలు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవహారాల్లో భాగం చేసేందుకు సిద్ధమైంది. ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురానుంది..అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకే చెందిన వార్త ఇది. ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా …
Read More »అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. నిర్మాణాలకు సీఆర్‌డీఏ తొలి ఆమోదం.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే..
ప్రభుత్వం ఆమోదించిన పనుల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఎఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు ఉన్నాయి. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి కొత్త ఊపరిపోసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమరావతి సహా పోలవరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం.. నిధులు సమకూర్చడంపై ఫోకస్ పెట్టింది. నిర్మాణాలకు సంబంధించితాజాగా …
Read More »ఏపీ రాజధాని పక్కనే బ్రహ్మ కైలాసం.! పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి..
పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించే ఈ క్షేత్రం.. బ్రహ్మకైలాసంగా ప్రసిద్ది చెందింది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండ పైనుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే…మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా..? అన్న భ్రమలోకి వెళతాము. అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు. ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న …
Read More »ఏపీలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది.. రెండు గుడ్‌న్యూస్‌లు ఇచ్చిన సర్కార్
అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేజీ టూ పీజీ కరికులంలో ఇకపై మార్పులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని అన్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ డేను ఘనంగా …
Read More »ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో జగన్..! నేతలకు నేరుగానే చెప్పేస్తున్న వైసీపీ అధినేత
పార్టీని వీడుతున్న వారిలో పదవులు అనుభవించిన వారు.. తాజాగా కీలక పదవుల్లో ఉన్నవారి సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతున్న జగన్ పార్టీ మారే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీని వీడే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత వైఎస్ జగన్ సందేశాన్ని ఇస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కాకుండా అధికారం లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లే నిజమైన కార్యకర్తలు అన్న సంకేతాన్ని పార్టీ …
Read More »ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గరి నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి …
Read More »ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన
అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి …
Read More »భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …
Read More »