ఏపీ, తెలంగాణ మధ్య భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరింత ముదిరింది. ఏకంగా.. ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఎస్.. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూముల వ్యవహారం మరోసారి కాక రేపింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా …
Read More »ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు
బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ …
Read More »ఆ గిరిజనులపై డిప్యూటీ సీఎంకు ‘మధుర’మైన అభిమానం..! ఈ సారి ఏం పంపించారంటే..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా గిరిజన గ్రామాలకు మరో గిఫ్ట్ పంపారు. కురిడి గ్రామస్తులకు మామిడిపండ్లు అందించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకున్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని వెంటనే సహాయం చేయడం ప్రశంసనీయం. గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాలో జీవనం.. అమాయక ప్రజానీకం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రెండు వందలకు పైగా గడపలున్న ఆ కుగ్రామం అమాయక ప్రజలకు నివాసం. అరకుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ.. అభివృద్ధికి …
Read More »ఉలిక్కిపడిన మారేడుమిల్లి.. ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేతల మృతి..
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, గాజర్ల రవి అలియస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో ఇప్పటికే సతమతం అవుతున్న వేళ అల్లూరి జిల్లా ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక నేతలు మృతి చెందడం మావోయిస్టులకు మరింత షాకిస్తోంది.అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని కింటుకూరు …
Read More »పెన్నా నది వద్దకు వెళ్లిన స్థానికులు.. కనిపించింది చూసి సంభ్రమాశ్చర్యం
నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారి …
Read More »డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ అడవి తల్లి బాట ‘ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామస్తులతో మాట్లాడారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే.. పవన్ కళ్యాణ్ గిరిజనుల ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు. వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం.. రహదారుల మాట …
Read More »తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?
అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం …
Read More »తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం (డిసెంబర్ 02, 2024) IST 08 30 గంటల సమయంలో ఉత్తర అంతర్గత తమిళనాడు మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం (తుఫాను”ఫెయింజల్”) అదే ప్రాంతంలో కొనసాగుతొంది. డిసెంబర్ 3, 2024 నాటికి అవశేష అల్పపీడన ప్రాంతం, ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగే అవకాశము ఉన్నది. …
Read More »అల్లూరి జిల్లా: వాగు ఒడ్డున బంగారు వర్ణంలో హనుమాన్ విగ్రహం.. చూసేందుకు జనం క్యూ, ప్రత్యేక పూజలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులో హనుమాన్ విగ్రహం కొట్టుకువచ్చింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం వరదకు కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. హనుమంతుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోయింది.. విగ్రహాన్ని ఇసుక నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి జడ్డంగి రామాలయంలో ఉంచారు. హనుమాన్ విగ్రహాన్ని మంచి ముహూర్తం చూసి ప్రతిష్ఠిస్తామని గ్రామ …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »