కర్నూలు జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని నమ్మ పలికిన ఒక కేటుగాడు మహిళల నుండి ఏకంగా కొట్ల రూపాయలు కాజేసి పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని మహిళలను నమ్మించిన ఒక వ్యక్తి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో పరారీలో ఉన్న జననీ మహిళా బ్యాంక్ సీఈఓ …
Read More »2018లో ఆదోనిలో మిస్సింగ్.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత…
కర్నూలు జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 2018లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు దాదాపు 7 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అయితే ఓ రిహాబిలిటేషన్ సంస్థ కృషితో బాలుడు తన తల్లిదండ్రుల చెంతకు చేరగలిగాడు. తప్పిపోయాడనుకున్న తమ కొడుకును తీసుకొచ్చి అప్పగించినందుకు ఈ సంస్థ సిబ్బందికి శ్రీకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు, ఓ రిహాబిలిటేషన్ సంస్థ చేసిన కృషితో మళ్ళీ తిరిగి తన కుటుంబాన్ని …
Read More »పొలం దున్నతుండగా దూరంగా ఏదో మెరిసింది..! ఏంటా అని దగ్గరికెళితే ఆ రైతు దశ తిరిగింది..?
వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు. అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి …
Read More »అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది …
Read More »ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటికొచ్చిందనుకునేరు.. తీరా డెలివరీ అయింది చూడగా కళ్లు తేలేశారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల నూనెపల్లెకు చెందిన పెయింటర్ రమణ అనుమానాస్పద మృతి పట్టణంలో కలకలం రేపింది. మృతుడు రమణకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రమణమ్మతో ఇరవై సంవత్సరాల క్రితం వివాహం అయింది. రమణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లకు జ్యోతి, చందన, సాయి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ నేపధ్యంలో పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న రమణకు వివాహేతర సంబంధం ఉందంటూ తరచూ భార్యభర్తల మధ్య ఘర్షణ జరగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒక నెల క్రితం …
Read More »ఐదేళ్లకే రైలెక్కి తప్పిపోయాడు.. కట్ చేస్తే.. 32 ఏళ్ల తర్వాత జరిగిన సీన్ ఇది!
ఐదేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడో కుర్రాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే, తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన …
Read More »ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ
కర్నూల్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్ నుంచి విజయవాడకు …
Read More »బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకంటే!
ఇంటింటికి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తానకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తెలియకుండా తానేవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆదోని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్థసారథి. ఈ క్రమంలో ఈయన తాజగా ఇంటింటికి పార్థసారథి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా …
Read More »గోదాంలో రేషన్ బియ్యం బస్తాలు సీజ్.. కట్ చేస్తే.. తెల్లారి రెవెన్యూ అధికారులు లెక్కపెట్టగా..
కర్నూలు జిల్లా ఆదోనిలో సిరిగుప్ప రోడ్డులోని గోదాములో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు సివిల్ సప్లై డైరెక్టర్ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే మహేష్ నాయుడు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 1800 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. సీజ్ చేయాలని సూచించి డైరెక్టర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే 1800 బస్తాలకు బదులు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు రెవెన్యూ పోలీస్ అధికారులు …
Read More »జనావాసంలో చిరుత హల్ చల్.. రైతుకి తీవ్ర గాయం.. అటవీ శాఖ నిర్లక్షంపై మండిపాటు..
అడవుల్లో నుంచి జనావాసంలోకి వచ్చిన చిరుత పులి హల్చల్ చేసింది. చిరుతను బంధించేందుకు రైతులు పడిన కష్టమంతా అంతా కాదు. చివరకు ఓ రైతుపై చిరుత పంజా విసిరింది. తీవ్ర గాయం కావడంతో రైతులంతా ఏకమై చిరుతను వలలో బంధించారు. ఇదంతా గమనిస్తున్న రైతులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.కర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుత పులి కనిపించింది. అనారోగ్య సమస్యతో …
Read More »