అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ భూములు కావడం, యూనివర్సిటీలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వనాన్ని తలపిస్తుండటంతో పెద్ద ఎత్తున కోతుల గుంపు విశ్వవిద్యాలయంలోకి వచ్చేది. వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా…క్లాస్ రూమ్స్ తోపాటు హాస్టల్స్ గదుల్లోకి చొరబడేవి. అందిన వాటినల్లా పాడు చేసేవి. దీంతో కోతుల భయం విద్యార్ధులు, అధ్యాపకులను వెంటాడేది. కోతుల బెడద తొలగించుకోవడానికి యూనివర్సిటీ పాలక వర్గం చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అవేవి …
Read More »క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన మహిళా MLA.. ఓ చెట్టు కింద ముగ్గురు యువకుల్ని చూసి షాక్..
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా రంగంలోకి దిగి గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పట్టించారు. కాలేజ్ పరిసరాల్లో మహిళలు, చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు తెలపడంతో ఆమె పోలీసులతో కలిసి గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపగా, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వాళ్లంతా చెట్టు కింద కూర్చున్నారు. ఏదో సరదా కూర్చున్నారా అంటే అదేం కాదు.. ముచ్చట్లు చెప్పుకుంటూ ఏకంగా గంజాయి సేవిస్తున్నారు. మరో ప్రపంచంలో తేలియాడుతున్నారు. …
Read More »విజృంభిస్తున్న కొత్త బ్యాక్టిరీయా…. బీ అలెర్ట్ అంటున్న వైద్యులు
గుంటూరులో మెలియాయిడోసిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియావల్ల దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ ఫీవర్‌లా అనిపించినా, ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ కాలంగా జ్వరంతో బాధపడుతున్నారా… సాధారణ ఫీవర్ లక్షణాలు ఉన్నాయా… దగ్గు, ఆయాసం తరుచుగా వస్తుందా… అయితే మీరు కొత్త రకం బాక్టీరియా బారిన పడినట్లే అంటున్నారు గుంటూరు వైద్యులు. మెలియాయిడోసిస్ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియా …
Read More »అమ్మను చంపిన ప్రాణ స్నేహితురాలు.. అవన్నీ పట్టించుకోకుండా కూతురు ఏం చేసిందో తెలుసా..
త్రివేణి, లక్ష్మీ ఇద్దరూ స్నేహితులు.. గుంటూరు నగరంలోని తారకరామ నగర్ కు చెందిన త్రివేణి.. గుజ్జనగుండ్లకు చెందిన లక్ష్మీ మధ్య స్నేహ బంధం ఉంది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అయితే త్రివేణి తన బంగారు ఆభరణాలతో డబ్బులు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చింది. అయితే ఈ విషయం తన భర్తకు చెప్పకుండా దాచింది. త్రివేణి, లక్ష్మీ ఇద్దరూ స్నేహితులు.. గుంటూరు నగరంలోని తారకరామ నగర్ కు చెందిన త్రివేణి.. గుజ్జనగుండ్లకు చెందిన లక్ష్మీ మధ్య స్నేహ బంధం …
Read More »నోట్ల హాస్పిటల్.. ఇక్కడ కాలిన, చిరిగిన నోట్లు కూడా తీసుకోబడును..
మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగినా, కాలిపోయినా ఏం చేస్తాం, వాటిని ప్లాస్టర్‌తో అతికించి చెలామని చేసేలా చూస్తాం. కానీ అక్కడ కూడా చెలామని కాకపోతే ఇక చేసేదేమి లేక పడేయడమో దాచి పెట్టడమో చేస్తుంటాం. మనకు ఎదైనా సమస్య వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో.. నోట్లను సరిచేసేందుకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కరెన్సీ హాస్పిటల్స్ ఇవెక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్ ఉంది. …
Read More »రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే
మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. వందకు నాలుగు రూపాయల వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొంతకాలం తర్వాత వడ్డీ కట్టలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి జులుం చూపించాడు. వడ్డీ కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధించాడు. కొద్దీ రోజుల తర్వాత ఇంటికి తాళం వేశాడు. వ్యాపారి వేధింపులు తాళలేక బాధితులు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. పాత గుంటూరుకు చెందిన అంకమ్మ అనే మహిళ తోపుడు బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గోపి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో …
Read More »సారూ.. జర కనికరించండి.. కలెక్టర్ దగ్గరకు ఎనిమిదేళ్ల బాలుడు!.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
సాధారణంగా ఇంట్లో ఒక సమస్య వస్తే ఓ 8 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడు. ఈ వయస్సులో నేను ఏం చేయగలనని గమ్మునుంటాడు. పెద్దలు కూడా పసిపిల్లాడు వాడికేం తెలుసు అనుకుంటారు. కానీ ఇక్కడో బాలులు తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏకంగా జిల్లా కలెక్టర్ చేతనే శభాష్ అనిపించుకున్నాడు. తన ధైర్యంతో మూతబడిన తన తల్లి టిఫిన్ సెంటర్‌ను తెరిపించాడు. ఇంతకు ఆ బాలుడు ఎవరో తెలుసుకుందాం పదండి.ఆ రోజు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే.. ఈ సందర్భంగా …
Read More »హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!
గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు …
Read More »దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..
పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే …
Read More »వామ్మో.. వాళ్లు అలా వచ్చేది అందుకోసమేనా.. ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా..
ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణాలకు పాల్పడింది.. మూడు హత్యలు చేసి.. ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.. సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధించారు. వివరాల ప్రకారం.. తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది. ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమారికి చెప్పారు. అయితే కుసుమ కుమారికి …
Read More »