గత వారం రోజులుగా బాలాజీ నగర్ ప్రాంతానికి చీకటి పడితే చాలు వచ్చేస్తున్న చిరుతలు రోజు ఏదో ఒకచోట స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 1000 కి పైగా కుటుంబాలు నివాసం ఉన్న బాలాజీ నగర్ పరిసరాల్లో ఉండే కుక్కలు పిల్లులు కోసం చిరుతలు వస్తున్నాయి. కుక్కల్ని పిల్లులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాలాజీ నగర్ లోని బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద మాటువేసి.. శేషాచలం కొండల్లోని చిరుతలు జనావాసాల వైపు పరుగులు పెడుతున్నాయి. తిరుమల అడవుల్లో పెరుగుతున్న చిరుతల సంతతి …
Read More »నేటి నుంచి శ్రీవారి దర్శనం మరింత సులభం..! ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్ను …
Read More »తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు
శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్పై దర్శనానికి 3 రోజుల సమయం పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనుంది. భక్తుల వసతికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ …
Read More »టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…ఎవరు అర్హులంటే?
సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవాలు ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయక’లక్షణాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి, తిరుమలలోనిప్రాథమిక విద్య నుంచే విద్యార్థుల్లో భక్తి భావం పెంచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సద్గమయ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని టిటిడికి …
Read More »రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..
కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల …
Read More »శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు… వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు
స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు …
Read More »తిరుపతి శివాలయంలో కళ్లు తెరిచిన శివలింగం.. పరమేశ్వరుడి మహత్యమేనంటూ..
టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్లో రికార్డు చేశారు. …
Read More »ఆరోగ్యం కోసం ఎవరైనా నడవాల్సిందే.. చినవెంకన్న ఆలయంలో గజలక్ష్మి మార్నింగ్ వాక్.. దాని వయ్యారం చూడాల్సిందే..
మనుషుల్లా జంతువులకు, పక్షులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కనుక వాటికీ శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. ఐతే జూలు , ఆలయాల్లోనూ ఉండేవి , ఇళ్లలో పెంచుకునే జంతువులకు నడక చాలా అవసరం అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చిన వెంకన్న ఆలయంలో గజలక్ష్మిగారు మావటిల పర్యవేక్షణలో రోజూ ఉదయమే సరదాగా వాకింగ్ చేస్తున్నారు. రోజుకు ఏడువేల అడుగులు నడిస్తే మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతుందని చెబుతున్నారు. కుర్చీలకే పరిమితమయ్యే ఉద్యోగాల వల్ల వ్యాయామం, శారీరక …
Read More »తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!
భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఇకపై గతంలో లాగా స్వామివారి ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఈవో …
Read More »ఒంటిమిట్టలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు…నిధులు కేటాయించిన టీటీడీ..మరెన్నో కీలక నిర్ణయాలు..!
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు గాను రూ.4.35 కోట్లు నిధులు కేటాయించింది. …
Read More »