తిరుపతి

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఆ సేవ కూడా!

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. అక్టోబర్ 1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల ఆలయంలో మంగళవారం (అక్టోబరు 1) రోజున ఆలయ శుద్ధి నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) టీటీడీ రద్దు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించి నిర్వాహకులకు సహకరించాలని …

Read More »

తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి …

Read More »

టీటీడీ ఈవోతో కేఎంఎఫ్ (నందిని డెయిరీ) ప్రతినిధుల భేటీ.. ఎందుకంటే!

టీటీడీ ఈవో జే శ్యామలరావును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో గౌతమి, కేఎంఎఫ్ ఎండి ఎంకె జగదీష్, డైరెక్టర్లు రఘునందన్, రాజశేఖర్ మూర్తి, మంజునాథ్ పాల్గొన్నారు. ప్రధానంగా నెయ్యి నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు, దేశంలో ఎక్కడెక్కడకు పాలు, నెయ్యి సరఫరా చేస్తున్నారనే అంశాలను వివరించారు. అలాగే …

Read More »

తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటి.. టీటీడీ నిబంధన ఇదే, జగన్‌‌ నుంచి డిక్లరేషన్‌ కోరనున్న అధికారులు?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ కోరినట్లే మాజీ సీఎం జగన్‌ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్‌ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని …

Read More »

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్‌ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఉచితంగా దర్శనం, వసతి.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం …

Read More »

ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్‌ ప్రొడెక్ట్స్‌ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు.. ఆయనకే చీఫ్ బాధ్యతలు, మరో ఇద్దరు IPSలు

తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతర అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిట్‌ చీఫ్‌గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో పాటు తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »

తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్.. తెలంగాణ భక్తురాలి ఆరోపణపై టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. …

Read More »