తిరుపతి

లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర …

Read More »

తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి టీడీపీ ఎంపీ, మహిళా ఎమ్మెల్యే బహుమానం

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ చేతులమీదుగా వస్త్రాలను అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. …

Read More »

తిరుమల లడ్డూ కౌంటర్‌ల‌లో సరికొత్త విధానం.. ఇకపై భక్తులకు ఈజీగా, మెషిన్లు వచ్చేశాయి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. లడ్డూల విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. తిరుమలలోని కౌంటర్ల దగ్గర ఎలాంటి ఆలస్యం లేకుండా.. త్వరగా భక్తులకు లడ్డూలను అందిస్తోంది. గతంలో చెప్పినట్లుగానే ఆధార్ ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు.. దీని కోసం ప్రత్యేకంగా స్కానింగ్ మెషిన్లను తీసుకొచ్చారు అధికారులు. టీటీడీ ఐటీ విభాగం.. తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే పనిలో ఉంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలను ప్రస్తుతం …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు చంద్రబాబు శుభవార్త.. టీటీడీకి కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన టీటీడీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని.. కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు అన్నారు. ఈ విషయంలోనూ రాజీ పడొద్దని.. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగపడాలని సూచించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. ⁠టీటీడీ సేవలపై …

Read More »

తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు …

Read More »

కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్‌‌ విడుదల, ముఖ్యాంశాలివే!

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి …

Read More »

పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కు తగ్గేది లేదు, జనసైనికుల కోసం!

తిరుమల పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అయితే మార్గ మధ్యలో ఆయన వెన్నునొప్పి కారణంగా ఇబ్బందిపడ్డారు. అయితే బుధవారం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించారు. అనంతరం తిరుమలోని అతిథి గృహంలో బస చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ …

Read More »

బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …

Read More »

తిరుమలలో డిక్లరేషన్‌పై పవన్ కళ్యాణ్ సంతకం.. కూతురి కోసం, టీటీడీ నిబంధనలు పాటిస్తూ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలెనా కొణిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలెనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

Read More »