తిరుపతి

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్‌ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఉచితంగా దర్శనం, వసతి.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం …

Read More »

ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్‌ ప్రొడెక్ట్స్‌ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు.. ఆయనకే చీఫ్ బాధ్యతలు, మరో ఇద్దరు IPSలు

తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతర అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిట్‌ చీఫ్‌గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో పాటు తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »

తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్.. తెలంగాణ భక్తురాలి ఆరోపణపై టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. …

Read More »

సుప్రీంకోర్టుకు చేరిన లడ్డూ లడాయి.. రెండు పిటిషన్లు దాఖలు.. ఏం జరగనుంది..

తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు రేపుతోంది.. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు రేపుతోంది.. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శనం, గదుల టోకెన్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ వెల్లడించింది. తిరుమల, తిరుపతి దేవస్థానం డిసెంబర్‌ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం , శ్రీవాణి టికెట్ల ను సోమవారం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్‌ 2024 నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంట‌ల‌కు విడుద‌ల చేస్తుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్‌లను …

Read More »

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే …

Read More »

తిరుపతి లడ్డూ వివాదం వేళ.. తిరుమలలో మహాశాంతి యాగం!

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో …

Read More »