తూర్పు గోదావరి

ఇదేం కర్మరా సామి.. ఇలసలు కూడా వేలంలో దక్కించుకోవాల్సి వస్తుంది..!

పుస్తెలు అమ్మి కొని తిందామన్న పులస దొరకడం లేదు. కొందరైతే పులస దొరికితే తమకే ఇవ్వాలని.. రేటు ఎంతైనా పర్లేదని జాలర్లకు అడ్వాన్సులు ఇస్తున్నారు. సీజన్ ఎండింగ్‌కి వచ్చేసింది. ఇప్పటివరకు దొరికిన పులసలు అంతంత మాత్రమే. దీంతో ఇలసలకు డిమాండ్ పెరిగింది. పులస దొరకడమే బంగారమైపోయింది. చాలు అరుదుగా మాత్రమే గోదావరి జలాల్లో దొరకుతున్నాయి ఈ అత్యంత రుచి కలిగిన ఖరీదైన చేపలు. దొరికే అరాకొర చేపలను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు తెగ పోటీ పడుతున్నారు. ఫలితంగా కేజీ, కేజీన్నర చేపలు సైతం దాదాపు …

Read More »

మాంసంప్రియులకు పండుగ.. పులస దొరికేసిందోచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

తింటే గోదావరి చేప తినాలి అంటారు. అందులో వర్షాల సీజన్‌లో పులస చేప కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది.. ఒకేసారి రెండు పులుసు దొరికితే మాంసపు ప్రియులు ఊరుకుంటారా..! వేలం పాటలో వేలకు వేలు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. ఒకపక్క పులస 29 వేల రూపాయలు పలికితే, మరో పులస 28,000 రూపాయలు పలికింది. ఇదే కాదు కోతవీడు దూరంలోనే పులస తర్వాతే ఇష్టపడే చేప పండుగప్ప ఇదేం తక్కువ లేదు. దాదాపు 16,000 రూపాయల ధర పలికింది. యానం గోదావరిలో …

Read More »

అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు …

Read More »

పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట …

Read More »

సారు మా బడికి రండి! – సీఎం, డిప్యూటీ సీఎంకు స్టూడెంట్స్‌ లేఖలు.. ఎందుకో తెలిస్తే..

ప్రైవేట్‌ స్కూల్స్‌ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమను ప్రభుత్వ స్కూల్‌లలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు. సార్‌ ఒకసారి మా బడికి రండీ అంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వ …

Read More »

గోదావరి జిల్లాల్లో వయాగ్రా పరవళ్లు – జల్సా రాయుళ్ళకు భలే మంచి ‘కాస్ట్‌లీ బేరం’

మెడికల్ రిప్రజెంటేటివ్‌గా వేషం కట్టి.. గణేష్ కుమార్ అనే ఆ ఒక్కడు సూత్రధారిగా మూడు జిల్లాల్లో యధేఛ్చగా సాగిస్తున్న వయాగ్రా సేల్స్ దందా… ఇప్పుడు స్టేట్‌వైడ్ సెన్సేషన్‌గా మారింది. 3 షాపుల దగ్గర మొదలై.. టోటల్ మెడికల్ ట్రేడ్‌నే వణికిస్తోంది. ఏ దుకాణాన్నీ వదలకుండా మెరుపుదాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వయాగ్రా మందుల దందా… ఎక్కడ తీగ లాగితే ఎక్కడ డొంక కదిలింది? గోదావరి జిల్లాల్లో వయాగ్రా, అబార్షన్‌ టాబ్లెట్ల అడ్డగోలు అమ్మకాలపై టీవీ9 ప్రసారం చేసిన …

Read More »

టెక్నలాజియా..! వాటర్ టిన్‌లతో గోదావరిలో చేపల వేట.. చూస్తే అదుర్స్ అంటారంతే..

చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు.. వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి.. ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి.. అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు, చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం.. కానీ గోదారోళ్ళు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంభిస్తున్నారు. చేపలు …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సొమవారం ఉదయం వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరొకరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి …

Read More »

కలవరపెడుతోన్న బర్డ్ ఫ్లూ.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్డు బంద్.!

తూర్పుగోదావరి, కోనసీమ అంబేడ్కర్ జిల్లాల వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే బర్ద్ ఫ్లూ ఎఫెక్ట్ వారిని సతమత చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్స్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. కానూరులో బర్డ్స్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటు సీతానగరం మండలం, మిర్తిపాడులో కూడా బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది. మిర్తిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన కోళ్ల ఫారంలో ఒకే రోజు 8వేలుకు పైగా కోళ్లు మృతవాత పడ్డాయి. దీంతో అధికారులు …

Read More »

అయ్యా బాబోయ్.. ఈ కోడిపుంజు ధర రూ.2లక్షలు.. ఎక్కడో తెలుసా? 

వసంతంలో కోకిల గానం, పురి విప్పి నెమలి చేసే నాట్యం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు, అప్పుడూ అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల హడావుడి అంతా ఇంతా కాదు. మరి ఈ సారి కోడిపుంజులు ధర ఎంత ఉందో తెలుసా? అక్షరాలా రూ.2లక్షలు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు హడావుడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పుంజులతో కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. కోడి …

Read More »