రెండున్నరేళ్ల లక్షిత్ అనే చిన్నారి రెండు రోజులుగా కనిపించకుండా పోయి, చివరకు మృతదేహంగా కనిపించాడు. అంగన్వాడీ కేంద్రం నుండి పోయిన లక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. ఆహార, నీటి లేమితో అతడు మృతి చెందినట్లు అంచనా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారి లక్షిత్ చివరకు మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి నారా …
Read More »పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే!
పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల చిన్నారి అంబటి ఖశ్వి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల వయస్సున్న అంబటి ఖశ్వి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను …
Read More »శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ అరుదైన పురాతన శిల్ప సంపద వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శివాలయ అభివృద్ధి పనుల సమయంలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు స్థానికులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. గురువారం శివాలయ పరిసరాల నుంచి మట్టిని తొలగించి …
Read More »టీడీపీ నేత హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల కస్టడీకి నలుగురు కీలక నిందితులు!
ఏప్రిల్ 22వ తేదిన హత్యకు గురైన టిడీపీ నేత వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులో తన కార్యాలయంలో ఉండగా ఆయన ప్రత్యర్ధులు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించారు. బాపట్ల పార్లమెంట్ టిడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో పాశవికంగా పొడిచి పొడిచి చంపారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో 53 సార్లు కర్కశంగా కత్తులతో పొడిచారు. దీంతో వీరయ్య చౌదరి అక్కడిక్కడే చనిపోయారు. …
Read More »సముద్ర తీరంలో తాబేళ్ల మృత్యుఘోష.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన జాతి తాబేళ్ల కళేబరాలు
సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే.. నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు అరికట్టేందుకు.. అరుదైన జీవాలను కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.కోస్తాతీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలు మృత్యువాడ పడ్డటం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలను …
Read More »అల్లుడు గిల్లుడు మామూలుగా లేదుగా.. పిలిచి పిల్లనిస్తే ఏం చేశాడో తెలుసా..?
ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో పదిహేను రోజుల క్రితం వరుసచోరీలు జరిగాయి. గ్రామంలో ఇళ్ళకు తాళాలు వేసి కూలిపనుల కోసం వలసలు వెళ్ళిన 12 ఇళ్ళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్థులంతా ఉలిక్కి పడ్డారు.అల్లుడి హోదాలో ఆ ఊరు వచ్చాడు.. పిల్లనిచ్చిన మామ ఇంట్లో సెటిలయ్యాడు.. సొంత ఊరును కాదని అత్తగారి ఊళ్ళో మకాం పెట్టడం వెనుక మర్మం తెలియక భార్య, అత్తమామలు మా మంచి అల్లుడు అంటూ తెగ మురిసిపోయారు.. ఊరంతా ఊరుమ్మడి అల్లుడిలా …
Read More »మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాజా వెంకటాద్రి సంచలన తీర్పు చెప్పారు… 2017లో 15 ఏళ్ల మైనర్ విద్యార్దినికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మ్యాథ్స్ టీచర్ అప్సర్ బాషాకు శిక్ష ఖరారు చేశారు… నిందితుడిపై నేరం రుజువైనందున మరణించేవరకు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించారు… బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించేలా చూడాలని న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని ఓ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికతో(15) అదే స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పని …
Read More »ఈ టీచర్ మహా ముదురు.. ఏకంగా రూ.6.70కోట్లు, మనోడి గురించి తెలిస్తే!
ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది.. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ తోటి ఉద్యోగుల్ని, జనాల్ని నిండా ముంచేశారు. ఉన్నట్టుండి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.. తీరా ఆరా తీస్తే ఆయన చేతిలో మోసపోయినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేస్తవారపేటకు చెందిన కిషోర్‌కుమార్.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ప్రభుత్వ ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్నారు. ఆయన తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, వ్యాపారుల్ని.. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశారు. కిషోర్ కుమార్ మెడికల్ …
Read More »టీడీపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి. పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »