విజయనగరం

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది. తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో …

Read More »

వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యాపాారి బలి.. సంచలనంగా మారిన ఆడియో రికార్డ్..

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు …

Read More »

దేశం ఖ్యాతిని పెంచిన తాపీ మేస్త్రీ కూతురు.. వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు గోల్డ్ మెడల్స్..

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది విజయనగరం జిల్లాకు చెందిన యువతి. కడు పేదరికంలోనూ ఏషియన్ జూనియర్ వెయింట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించి దేశం ఖ్యాతిని పెంచింది. చిన్న పల్లెటూరు నుంచి అంతర్జాతీయ వేదిక దాకా సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పేదరికంలో పుట్టిన ఆ యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నిలిచింది. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవని స్థితి నుండి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంకు చెందిన …

Read More »

పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీస్‌కు పిలిపించుకుని మరీ రూ.లక్ష ఎందుకిచ్చారంటే?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన విజయ నగరం జిల్లాకు చెందిన ఓ ఇంటర్మీడియెట్ కుర్రాడిని ప్రత్యేకంగా తన ఆఫీస్ కు పిలిపించుకుని మరీ అభినందించారు. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ …

Read More »

 బాత్రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్.. ఆ తర్వాత.!

ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూం‌లోకి వెళ్లగా.. ఆమెకు ఆ బాత్రూం కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం రావడాన్ని గుర్తించింది. వెంటనే అక్కడ ఏముందా అని చూడగా.. దెబ్బకు కనిపించింది చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అసలు ఏమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించి.. ఎందుకలా చేశావ్ అని అడిగిన ఆమె భర్తపై దాడి చేసిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పోలాకి గౌరీ …

Read More »

పేదోళ్లకు నాణ్యమైన విద్య దక్కాలంటే మీలాంటి వాళ్లు కావాలి సార్ – విజయనగరం జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు

విద్యా హక్కు చట్టం (RTE) అమలులో తప్పులపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 25% సీట్లు కేటాయించాల్సిన నిబంధనలు ఉల్లంఘించిన ఆరు కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలలో సౌకర్యాల లేమి, అవకతవకలు గుర్తించడంతో విద్యా రంగంలో కలకలం రేగింది. అధికారుల దర్యాప్తు ఒత్తిడితో పాఠశాలలు వెనుకడుగు వేసి, నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చాయి.విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి షాక్ …

Read More »

విజయనగరం పైడిమాంబ చరిత్ర ఇదే.. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.?

విజయనగర సంస్థానం నిర్మించిన 104 దేవాలయాల చరిత్రను మనం పరిశీలిస్తే, ఆ ఆలయాల చరిత్రను వాటి స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఈ సంస్థానం నిర్మించిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయానికి సంబంధించి నిర్దిష్ట చరిత్ర లేదు. స్థల పురాణం ప్రకారం, పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత. ఈ అమ్మవారు విజయనగరం మహారారులకుకు సోదరి అని కొందరు అంటారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పైడిమాంబ చరిత్ర తెలుసుకుందాం.. అప్పట్లో బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కొన్ని …

Read More »

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల …

Read More »

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో పాటు పొరపాటున జరిగితే క్షణాల్లో నిందితులను పట్టుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీతో విజయనగరం టూ టౌన్ పోలీసులు చేపట్టిన విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీస్ స్టేషన్లకి రోల్ మోడల్ గా మారింది. ఇదే విధానాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు ఆయా జిల్లాల పోలీస్ బాసులు.ఇటీవల కాలంలో …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!

చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. అదే జీవితం కాదు. చదువులేని వారు కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. వారిని స్పూర్తిగా చేసుకుని కూడా నచ్చిన రంగాల్లో రాణించవచ్చు. ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవడం ఎంత వరకు న్యాయం..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజా ఫలితాల్లో కొందరు విద్యార్ధులు ఫెయిల్‌ కావడంతో పలు చోట్ల వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ …

Read More »