విశాఖపట్నం

ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. సాకారం కాబోతున్న ఏళ్ల నాటి కల..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. దీంతో ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్‌ ను ఏర్పాటు …

Read More »

విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం, 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టుల ప్రగతి విజయవాడలో 66 కి.మీ, విశాఖపట్నంలో 76.9 కి.మీ పొడవునా డబుల్ …

Read More »

రూ.2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం..!

1200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును గంగవరం పోర్టు సమీపంలో దాదాపు 1200 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీని ఖరీదు రూ. 1.85 లక్షల కోట్లు. దీని ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయనున్నారు. దీంతో మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాన మోదీ శ్రీకారం చుట్టారు.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఒకే …

Read More »

హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.సంచలనాలకు కేరాఫ్‌గా మారింది విశాఖ హనీట్రాప్‌ కేసు. రోజుకో అప్‌డేట్‌.. పూటకో ట్విస్ట్‌తో పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న క్రైమ్‌ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ మద్దతు ఇవ్వడం.. …

Read More »

హ్యాట్సాఫ్.. మహిళా ఎస్సై..! మృతదేహాన్ని భుజాన వేసుకుని..!

విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతానికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని భుజాన మోస్తూ తీసుకెళ్లారు ఎస్ఐ సూర్యకళ.అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం …

Read More »

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక! ఎవరు అర్హులంటే..

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాట్ ఉద్యోగ నియామకాలకు నోఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలను చేపట్టనుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతీ నెల స్టైఫెండ్ కూడా అందిస్తారు..రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్​లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం​స్టీల్​ప్లాంట్.. 2024 డిసెంబర్‌ బ్యాచ్‌కు సంబంధించి దాదాపు 250 అప్రెంటీస్​పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్​విడుదల చేసింది. అర్హత, ఆసక్తి …

Read More »

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. ఆ తర్వాత ఓ పాడుబడ్డ ఇంట్లో అసలు సీన్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై …

Read More »

కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రుల ఆందోళన..!

చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ …

Read More »

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »

రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..

అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది. ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా …

Read More »