నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట.. ఇది మన పెద్దలు చెప్పేమాట. వారి కాలంలో ఏ పరిస్థితిని చూసి పెద్దలు ఈ సామెత చెప్పారో తెలియదు కానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. అసలు నిజం తెలియకముందే.. అబద్ధం ఊరంతా చుట్టి వచ్చింది. తీరా పోలీసులు అసలు వాస్తవాలు వెల్లడించిన తర్వాత.. అందరూ ఔరా అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. …
Read More »ఆమె సాఫ్ట్‌వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..
విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, …
Read More »తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం (డిసెంబర్ 02, 2024) IST 08 30 గంటల సమయంలో ఉత్తర అంతర్గత తమిళనాడు మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం (తుఫాను”ఫెయింజల్”) అదే ప్రాంతంలో కొనసాగుతొంది. డిసెంబర్ 3, 2024 నాటికి అవశేష అల్పపీడన ప్రాంతం, ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగే అవకాశము ఉన్నది. …
Read More »ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!
ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు …
Read More »డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.కాకినాడ యాంకరేజ్ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ రెండు రోజుల క్రితం సముద్రంలో …
Read More »ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. రైల్వే జోన్‌పై మరో ముందడుగు, రెండేళ్లలో పూర్తి
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ భవన సముదాయానికి సంబంధించిన డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ భవన సముదాయాన్ని బీ1+బీ2+జీ+9 (బేస్‌మెంట్ 1, 2, గ్రౌండ్, మొత్తం 9 ఫ్లోర్లు)గా నిర్మించాలని నిర్ణయించారు.. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్‌లో డిజైన్ ఆకట్టుకుంది. ఈ భవనాన్ని మొత్తం 27,548.3 …
Read More »విశాఖ: రూ.1500కు కొనుగోలు చేసి రూ.25 వేలకు అమ్మకం.. ఐదేళ్లుగా నడుస్తోంది, పెద్ద ప్లానింగే
ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాలాజీ గోవింద్ …
Read More »విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!
విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్ ట్రాఫిక్ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ …
Read More »అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను …
Read More »విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు
నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు. ఈ నెల 16న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, …
Read More »