శ్రీకాకుళం

మా నాన్న ఏరోజు రాలేదు.. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో కేంద్రమంత్రి భావోద్వేగం!

స్కూల్‌లో పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ ఉంటే ఎవరు వెళ్తారు.. పిల్లలు చదివే స్కూల్‌కు తల్లిదండ్రులు వెళ్తారు. కానీ ఇక్కడో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ కార్యక్రమం సందర్భంగా తన తల్లిదండ్రులు చదువకున్న స్కూల్‌కు వెళ్లారు. టీచర్స్‌, పేరెంట్స్‌ మీటింగ్‌లో పాల్గొని, తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టిన మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్‌లో భాగంగా గురువారం తమ పిల్లలు చదువుకునే స్కూల్స్‌కి తల్లిదండ్రులు వెళ్తే. కేంద్ర పౌర …

Read More »

అంజనీపుత్రునికి 10 వేల వడలతో అభిషేకం.. ఎక్కడంటే…?

దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.ఆంజనేయ స్వామికి వడలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు చాలామంది భక్తులు వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఈ వడలనే మాలగా కూర్చి వడ …

Read More »

ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల నుంచి ఏప్రిల్‌ 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ట్రాలకు చెందిన …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే అరసవెల్లి సూర్య దేవాలయం.. చరిత్ర తెలుసా.?

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్‎ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో  ఈ ఆలయన్ని నిర్మించారు. మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.  ఇక్కడి మూలవిరాట్‎ను స్వయ౦గా దేవే౦ద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. అయితే ‘పద్మపురాణ౦’ …

Read More »

ఏపీలోకి ఎంటరైన 30 మంది మావోయిస్టులు.. DGP షాకింగ్‌ వ్యాఖ్యలు!

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఆపరేషన్ కతార్ పేరుతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా చతిస్‌ఘడ్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు అందరిలో అలజడ రేపుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురు దెబ్బగానే అంతా భావిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందగా ఆయన మృతదేహానికి శ్రీకాకుళం జిల్లాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. …

Read More »

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »

అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి.జిల్లాలో రెండు వేరువేరు ఘటనలలో రూ.72.25 లక్షల దొంగ నోట్లను పోలిసులు పట్టుకున్నారు. మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని..శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలిసులు. రెండు వేరువేరు ఘటనలలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. జిల్లాలోని మెలియాపుట్టి, జి.సిగడాం పోలీస్ స్టేషన్లు పరిధిలో మొత్తం రూ. 72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలకు సంబంధించి ఎనిమిది మందిని …

Read More »

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు.. నిమ్మకాయలు, గుడ్లు.. ఏంటని చూస్తే గుండె జారినంత పనైంది..

 పూజలు.. ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ…వీటి పేరు విన్నా, వీటిని చూసిన ఎవరైనా వణికిపోతారు. మూఢనమ్మకాలను నమ్మే వారైతే వారికి ఇక నిద్రపట్టదు.. ముఖ్యంగా హర్రర్ మూవీలలో ఈ క్షుద్ర పూజలను మరి భయంకరంగా చూపిస్తారు. క్షుద్ర పూజలు ద్వారా ఎవరినైన లోబరుచుకోవటం, వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం, వారిని చావు అంచుల వరకూ తీసుకువెళ్ళడం వంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తూ ఉంటే ఇక ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంత్ర, తంత్రాలు… నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు …

Read More »

శ్రీకాకుళంలో విషాదం.. డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్‌కి గుండెపోటు..సీట్‌లోనే కుప్పకూలి..

రెప్పపాటు జననం..రెప్పపాటు మరణం అన్నారు పెద్దలు.. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతోన్న మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండానే అకాల మరణాలు జరుగుతున్నాయి. చిన్నారులు, కాయ కష్టం చేసుకునే కస్టజీవులు సైతం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్‌పేట జంక్షన్ వద్ద డ్రైవింగ్ చేస్తూ గుండె పోటుతో లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే డ్రైవర్ మృతితో లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై భారీ విధ్వంసాన్ని …

Read More »

ఏపీ మద్యం షాపుల లాటరీలో తెలంగాణ మహిళలకు లక్.. ఎన్ని వచ్చాయంటే!

Andhra Pradesh Liquor Shop Lottery Women Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభంకాగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించగా.. 3,396 మద్యం షాపులకు గాను 345 మహిళలకే దక్కాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 10.20 శాతం షాపులు మహిళలకే లభించాయి. వీటిలో కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున మహిళలకే …

Read More »