శ్రీ సత్యసాయి

తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం… భవిష్యత్‌ ప్రణాళికలపై విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు

శ్రీసత్యసాయి జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌లో మంత్రి లోకేష్‌తో కలిసి పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు, టీచర్స్‌తో సమావేశమైన చంద్రబాబు.. పిల్లల చదువు కొనసాగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వారి భవిష్యత్‌ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. చదువులో బాగా రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వారికి నిర్దేశించారు. తల్లిదండ్రులతో ముచ్చటించిన అనంతరం తరగతికి వెళ్లారు ముఖ్యమంత్రి. కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌ అనేది ఇంతవరకూ కార్పొరేట్ స్కూళ్లకు …

Read More »

సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!

సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..మ్యూజిక్‌ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. …

Read More »

ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్‌లో షాకింగ్ సీన్..!

రాత్రి కిడ్నాప్.. ఉదయానికి శవమై కనిపించిన కాంట్రాక్టర్.. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ కిడ్నాప్ అండ్ మర్డర్ సంచలనం రేకెత్తిస్తోంది. కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామ సమీపాన విద్యుత్ కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డిని తన ఫామ్ హౌసులో నిద్రిస్తుండగా రాత్రి కొంతమంది దండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉదయం అదే ఫామ్ హౌస్ వద్ద కూలీలకు షాకింగ్ సీన్ కనిపించింది. రాత్రి కిడ్నాప్ అయిన రాజశేఖర్ రెడ్డి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు. నల్లమాడ మండలం బొగ్గులపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ట్రాన్స్‌కో …

Read More »

హిందూపురం: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రైతు.. వారానికే షాకిచ్చిన భార్య, ఊహించని ట్విస్ట్!

ఆయనో రైతు.. 40 ఏళ్లైనా పెళ్లి కావడం లేదు.. ఎన్నో సంబంధాలు చూసినా కుదరడం లేదు. తల్లిదండ్రులు వృద్ధులు.. కొడుకు పెళ్లి చూడాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు.. మధ్యవర్తుల్ని సంప్రదించడంతో ఓ సంబంధం కుదిరింది. అతడికి వివాహం కూడా అయ్యింది.. కానీ ఆ తర్వాత ఊహించని పరిస్థితి ఎదురైంది. వారం తర్వాత తరువాత ఆమె అతడికి మస్కా కొట్టి వెళ్లిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన …

Read More »

కేతిరెడ్డీ.. నీ కోరిక తీరుస్తాం.. మంత్రి సత్యకుమార్ వార్నింగ్

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం ఉద్రిక్తత తలెత్తింది. ధర్మవరం సబ్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ లీడర్ హరీష్ వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. సబ్ జైలులో రిమాండ్‌‍లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు.. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

 సీఎం బావకు బాలకృష్ణ రిక్వెస్ట్.. నెరవేరేనా?

tdp mla nandamuri balakrishna open anna canteens in hindupur:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి.. బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ అందింది. బావ చంద్రబాబు అంటే బాలయ్యకు ఎంత గౌరవమో.. అలాగే బావమరిది బాలకృష్ణ అంటే చంద్రబాబుకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ విషయంలో చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు బాలకృష్ణ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. శుక్రవారం హిందూపురంలో పర్యటించారు. రెండుచోట్ల అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించిన బాలకృష్ణ.. స్వయంగా తన …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

Read More »

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …

Read More »