ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిటలాడుతున్నాయి. గురువారం నుంచి ఆఫీసుల్లో రష్ కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 14250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్కరోజులో ప్రభుత్వానికి 107కోట్ల ఆదాయం వచ్చింది. గురువారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అయితే అల్లూరి అల్లూరి జిల్లాలో మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవ్వాయి. ఇక శనివారం నుంచే ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అలాగే భూముల మార్కెట్ ధరలు కూడా పెంచుతున్నట్లు …
Read More »వెంకన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు.. ఎన్ని లక్షల లడ్డూలు రెడీ చేస్తున్నారంటే..?
రథసప్తమి వస్తోంది…! భక్తుల తాకిడి గట్టిగానే ఉంటుంది…! మరేం చేద్దాం…? ఎలా ముందుకెళ్దాం…? ఇదే విషయమై సమావేశమైన టీటీడీ పాలక మండలి… కీలక నిర్ణయాలు తీసుకుంది. మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఛైర్మన్ పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం….తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలకమండలి…పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమిపై కీలకంగా చర్చించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని… రథసప్తమి నాడు చేయాల్సిన ఏర్పాట్లపై …
Read More »ఏపీ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశం..
మాజీమంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణల ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇవి కక్షసాధింపు చర్యలని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే..అటు అధికార పక్షం మాత్రం విచారణలో అన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. ఈ లోపే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ.. క్షేత్రస్థాయి పర్యటనలో అసలు విషయం బయటపెట్టేందుకు చర్యలు చేపట్టింది.వరుస కేసులు.. ఆరోపణలు.. అనుచరుల అరెస్ట్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే.. …
Read More »అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..
తిరుమలలో చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తిరుమలలో వన్యప్రాణులు జనావాసాలకు సమీపంగా వస్తుండటం కలకలం రేపుతోంది.. చిరుతలు, ఏలుగుంబ్లు, పాములు.. ఇలా చాలా జంతువులు జనావాసాలకు సమీపంగా వస్తుంటాయి.. తాజాగా.. తిరుమలలో మరోసారి …
Read More »ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్ సర్వర్లు మొరాయిస్తున్నాయి.ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడటంతో అవి మొరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త …
Read More »చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సర్వీసులు
ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్ టైమ్ వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, …
Read More »ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ధృవపత్రాల జారీ !
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. పౌరసేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం(జనవరి 29) సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. …
Read More »ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …
Read More »ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చెయనున్న నేపథ్యలో.. హరీష్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు..నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో గుప్తాను డీజీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ …
Read More »విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం, 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టుల ప్రగతి విజయవాడలో 66 కి.మీ, విశాఖపట్నంలో 76.9 కి.మీ పొడవునా డబుల్ …
Read More »