ఆంధ్రప్రదేశ్

టెన్త్, ఇంటర్‌ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు!

రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 904 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే (SWR).. హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ …

Read More »

రాయలసీమ నీటి కష్టాలకు రామ్‌రామ్‌… నేడు హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి

సీమ ప్రజల నీటి నిరీక్ష ముగిసింది. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా మల్యాల నుంచి ఫేజ్‌ 1, 2 కింద 554 కిలో మీటర్ల మేర కాలువ లైనింగ్‌, వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించిన అనంతరం హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్నారు. ఆపై మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేస్తారు. నీటి విడుదల …

Read More »

ఇక సర్కార్‌ బడులన్నింట్లో ఇంటర్నెట్, కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యాలు.. మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటికీ ఇక కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం రానుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేషన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునర్‌ వ్యవస్థీకరించి, నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్‌ నిర్వహించి, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టెమ్‌ కార్యకలాపాలు …

Read More »

సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, …

Read More »

బెజవాడలో పట్టపగలు జంట హత్యల కలకలం.. పరారీలో రౌడీ షీటర్‌!

విజయవాడలో నిన్న డబల్ మర్డర్లు చేసిన అనంతరం పరారైన రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేశాడు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు బంధువులకు కబురు చేయగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు.. విజయవాడ పట్టణంలో పట్టపగలు ఇద్దరు …

Read More »

ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ముందే కట్టే పనిలేదు – సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఏపీలోని కూటమి సర్కార్ దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి …

Read More »

ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన… రెండు రోజుల పాటు ఏమేం చేశారంటే…

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు కీలక విషయాలపై వినతులు అందించారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, అశ్వినీ వైష్ణవ్‌, మాండవీయ, నిర్మలాసీతారామన్‌, పాటిల్‌తో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి …

Read More »

కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో సంచలన నిర్ణయాలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్‌, నిమ్మల రామానాయుడు, ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ …

Read More »

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గాల్లో 54 ప్రత్యేక రైళ్ల సేవలు పొడగింపు!

రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు మార్గాల్లో సేవలందిస్తున్నా సుమారు 54 ప్రత్యేక రైళ్ల సేవలను అక్టోబర్‌ 15వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్నప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న సుమారు 54 ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్ట్ నుంచి అక్టోబర్‌ …

Read More »

ఇది సార్ మన రేంజ్.. అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం..

అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ది.. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో …

Read More »