ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీజేపీ నేతకు 5 మద్యం షాపులు.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులకు 25 షాపులు, పాపం మంత్రి నారాయణ!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లాటరీలో చిత్ర విచిత్రాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులకు భారీగా షాపులు దక్కాయి. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ఏకంగా 5 షాపులు దక్కడం విశేషం. ఆయనకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బల్లో 5 మద్యం షాపులు దక్కాయి. మంత్రి నారాయణ.. మొన్నటి ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల కోసం నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం షాపులకు …

Read More »

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ …

Read More »

పలాస: యువకుడు ఒకసారి మిస్.. నిమిషాల్లో రెండోసారి చావు తప్పలేదు

శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్‌ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు. ఆ ఘటనలో యువకుడి తలకు …

Read More »

ఏపీలో ఓ వ్యక్తి అతి తెలివి.. ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు, ఒక్కడే ఎంత ఖర్చు చేశారో తెలుసా!

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అతి తెలివితో 155 మద్యం షాప్‌లకు గాను 155 షాపులకు దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు⁠ 23 షాపులకు లాటరీ పూర్తికాగా.. ఒక్క షాపు కూడా రాలేదు. ఆయన తనను అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క షాపైనా తనకు రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కో షాపుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 10 లక్షలతో …

Read More »

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 …

Read More »

అరకు వెళ్లే పర్యాటకులకు అద్భుతమైన అవకాశం.. ఊటీ రేంజ్‌లో థ్రిల్, ఆ రెండు సరికొత్త అనుభూతులు

ఆంద్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రా ఊటీగా పిలిచే అరకులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పద్మాపురం ఉద్యానంలో హాట్‌ బెలూన్‌‌ను సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ని నిర్వహించారు. అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారన్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌. అందుకే హాట్‌బెలూన్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. హాట్‌ బెలూన్‌ పర్ాయటకులను సుమారు 300 …

Read More »

ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా.. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి మహర్దశ, ఈసారి భారీగా

ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా.. మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ నిధుల్ని ఇచ్చారు. వీటిలో అన్‌టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.395.5091 కోట్లు ఇవ్వగా.. టైడ్‌గ్రాంట్స్‌ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామపంచాయతీలకు దక్కుతాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకుప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …

Read More »

విజయవాడ లోకో పైలెట్‌ను ఆ ఒక్క కారణంగానే చంపేశా.. షాకింగ్ విషయాలు చెప్పిన బీహార్ నిందితుడు

విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకోల పైలెట్ హత్య మిస్టరీ వీడింది.. ఎబినేజర్‌ను హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని బీహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. విజయవాడలో లోకో పైలట్ ఎబినేజర్‌ను విధుల్లో ఉండగా.. దేవ్‌కుమార్ ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎబినేజర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐదు టీమ్‌లుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా …

Read More »

పండుగ రోజున చంద్రబాబు ఇంటికి చిరంజీవి.. అసలు కారణమదే..

మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక …

Read More »