తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను నవంబరు 7వ తేదీన టెండర్, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,880 కేజీలు టెండర్, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ …
Read More »ఏపీలో మద్యం షాపుల నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మద్యం షాపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఎమ్మార్పీపై కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా వదిలేది లేదని హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు.. ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై చర్చించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించే, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటి తప్పు కింద రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. ఒకవేళ ఆ తర్వాత కూడా మళ్లీ అవే తప్పులు …
Read More »ఏపీలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నేను స్థలం ఇస్తా.. వృద్ధురాలి పెద్ద మనసు
ఏపీలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమైంది. అయితే నరిశెట్టి రాజమ్మ అనే వృద్ధురాలు పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రాజమ్మ.. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వరద బాధితులకు రూ.50 వేల చెక్కును అందించారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే.. అందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు రాజమ్మ. తమ గ్రామంలో ఇళ్లు లేని పేదలున్నారని …
Read More »కేంద్రం నిర్ణయంతో విజయవాడకు మహర్దశ.. అక్కడే ఫిక్స్, త్వరలోనే!
కేంద్రం విజయవాడకు సంబంధించిన పలు రైలు, హైవే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడకు తూర్పు బైపాస్ కూడా వచ్చింది. అయితే కేంద్రం ఓ షరతు విధించింది. లాజిస్టిక్ హబ్ కోసం తమకు 100 ఎకరాలు భూసేకరణ చేసి కేటాయించాలని కోరింది. ఈ క్రమంలో కొండపల్లిలో హబ్ ఏర్పాటుకు అడుగులుపడుతున్నాయి. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. …
Read More »హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ రియాక్షన్ ఇదే..
తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన విజయ్.. ఆదివారం టీవీకే మహానాడును నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు అశేష జనవాహిణి హాజరైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను విజయ్ వెల్లడించారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయ్ను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో …
Read More »తుని ఆర్టీసీ డ్రైవర్‌కు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్.. మరో బంపరాఫర్ ఇచ్చారు
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ …
Read More »రాజమహేంద్రవరంవాసులకు సూపర్ న్యూస్.. గోదావరి నదిలో విహరిస్తూ రెస్టారెంట్లో ఫుడ్ తీనొచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజమహేంద్రవరం వాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గోదావరిపై బోటుపై విహరిస్తూ.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఈ అనుభూతిని ప్రజలకు అందించేందుకు సరికొత్తగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక దగ్గర ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. పర్యాటకులు, స్థానికులు రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్ సమీపంలోని …
Read More »ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్స్యూరెన్స్ …
Read More »నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు
సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …
Read More »పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే
సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను …
Read More »