చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న కేటుగాడు, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు. డబ్బులు ఇచ్చిన కొన్నాళ్లకు నిందితుడి బండారం బయటపడడంతో మోసపోయినట్టు గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకొచ్చింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను రెండో పెళ్లి చేసుకొని, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు. ఆమె …
Read More »గోవిందా గోవింద.. ఇకపై సాయంత్రం అన్నప్రసాదంలోనూ వడ
తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. జులై 7 నుండి సాయంత్రం సెషన్‌లో కూడా వడలను టీటీడీ భక్తులకు వడ్డిస్తోంది. మార్చి 6 నుంచి మధ్యాహ్న సమయంలో అన్నప్రసాదంలో వడను ఇస్తున్నారు. ఇప్పుడు రాత్రి భోజన సమయంలో …
Read More »అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం – ఏపీలో వానలే వానలు
అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రమంతటా ఉంటాయని వివరించింది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు జూలై 07న ఉదయం 0830 గంటలకు నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది …
Read More »రేషన్ పంపిణీలో కొత్త టెక్నాలజీ.. ఫోన్‌లో ఫోటో దిగితే చాలు.. వెంటనే రేషన్!
ఇకపై రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం కోసం గంటలు గంటలు నిలబడే అవసరం లేదు. ఎందుకంటే రేషన్ పంపిణీ వ్యవస్థలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది హిమాచల్ ప్రభుత్వం. అదే ఫేస్ అథంటికేషన్ వ్యవస్థ. ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది. ఒకప్పుడు రేషన్ ఎలా తీసుకునే వాళ్లం, రేషన్ ఫాప్‌కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యాన్‌వల్‌గా రాయించుకొని రేషన్ తీసుకునేవాళ్లాం. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ పాస్ యంత్రాల ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా, ఐరిస్ స్కాన్ ద్వారా …
Read More »పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట …
Read More »ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే …
Read More »సారు మా బడికి రండి! – సీఎం, డిప్యూటీ సీఎంకు స్టూడెంట్స్ లేఖలు.. ఎందుకో తెలిస్తే..
ప్రైవేట్ స్కూల్స్ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమను ప్రభుత్వ స్కూల్‌లలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు. సార్ ఒకసారి మా బడికి రండీ అంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వ …
Read More »గోదావరి జిల్లాల్లో వయాగ్రా పరవళ్లు – జల్సా రాయుళ్ళకు భలే మంచి ‘కాస్ట్‌లీ బేరం’
మెడికల్ రిప్రజెంటేటివ్‌గా వేషం కట్టి.. గణేష్ కుమార్ అనే ఆ ఒక్కడు సూత్రధారిగా మూడు జిల్లాల్లో యధేఛ్చగా సాగిస్తున్న వయాగ్రా సేల్స్ దందా… ఇప్పుడు స్టేట్‌వైడ్ సెన్సేషన్‌గా మారింది. 3 షాపుల దగ్గర మొదలై.. టోటల్ మెడికల్ ట్రేడ్‌నే వణికిస్తోంది. ఏ దుకాణాన్నీ వదలకుండా మెరుపుదాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వయాగ్రా మందుల దందా… ఎక్కడ తీగ లాగితే ఎక్కడ డొంక కదిలింది? గోదావరి జిల్లాల్లో వయాగ్రా, అబార్షన్ టాబ్లెట్ల అడ్డగోలు అమ్మకాలపై టీవీ9 ప్రసారం చేసిన …
Read More »ఆర్‌ఆర్‌బీ రైల్వే లోకో పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష తేదీ ఇదే.. వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు
ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2024 సీబీటీ2 పరీక్షలు మార్చి 19, మే 2, 6వ తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రైల్వేశాఖ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్‌లతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులను జులై 2 నుంచి 7వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. లోకోపైలట్ పరీక్షలకు …
Read More »వైజాగ్ కొకైన్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి డాక్టర్.. మూడుకు చేరిన అరెస్టులు
విశాఖపట్నంలో కలకలం రేపిన కొకైన్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియాతో ఓ డాక్టర్‌కు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు థామస్ డైరి లో కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్ కు హైదరాబాద్ తోనూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాదులోనూ ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో పలుమార్లు విశాఖకు అక్షయ్ డ్రగ్స్ దిగుమతి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాఫియాతో విశాఖలో లింకులున్న మరికొంతమంది ప్రమేయంపై …
Read More »