ఆంధ్రప్రదేశ్

భువనేశ్వరి, బ్రాహ్మణి సంపాదిస్తుంటే.. నేను, లోకేష్ రాజకీయాలు చేస్తున్నాం..

నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారంటూ జ్యూరిచ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. నిత్యస్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే..ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని ఒకటి రెండుసార్లు విఫలం అయినా హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. …

Read More »

Bank Holiday: జనవరిలో ఆ రోజు కూడా సెలవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రోజు సెలవు ఇచ్చింది. కనుమ పండుగను కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలోని బ్యాంకు ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మాత్రమే సెలవు ఇచ్చారు. డిసెంబర్‌లో విడుదల చేసిన 2025 ప్రభుత్వ సెలవుల జాబితాలో.. ఏపీలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14 మాత్రమే సెలవు ఇచ్చారు, అయితే జనవరి 15న అంటే కనుమ రోజు …

Read More »

సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్

Chandrababu: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం తమ సొంత గ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న చంద్రబాబు కుటుంబం.. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, ఉత్సవాలు చూసేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో 33కేవీ సెమీ …

Read More »

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని పవన్ …

Read More »

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త.. సంక్రాంతి ముందే వచ్చేసిందిగా

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త. సంక్రాంతి ముందే వచ్చేసిందని చెప్పొచ్చు. జనవరి 11 నుంచి విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. 20833-34 నెంబర్ గల విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం 16 కోచ్‌లతో 1,128 ప్యాసింజర్ల సామర్థ్యంతో సేవలు అందిస్తుండగా.. రేపటి నుంచి అనగా జనవరి 11న ఈ ట్రైన్ 1,414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్‌లతో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం 16 కోచ్‌లు ఉన్న ఈ వందేభారత్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, …

Read More »

మీరూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి ఘటనకు బాధ్యత వహిస్తూ తాను ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టీటీడీ ఈవో సహా అధికారులందరూ బాధితులకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కొందరు అధికారులు పని చేయడం మానేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు.తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే.. తిరుపతి ఘటనపై తాను క్షమాపణలు అడిగానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు.. ఈవో, ఏఈవో క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటని …

Read More »

 బాబోయ్.. మళ్లీనా.. ఏపీలో ఈ ప్రాంతాలకు మోస్తరు వానలు.. తాజా వెదర్ రిపోర్ట్

నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అనగా శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ఈరోజు:- తేలికపాటి …

Read More »

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఈ సమావేశంలో తీర్మానించనున్నట్టుగా తెలిసింది. సాయంత్రం 4 గంటలకు …

Read More »

తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఈ …

Read More »

కోడి పందేలకు కోర్టు చిక్కులు…హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది…

సంక్రాంతి అంటేనే ఎంతో సందడిగా ఉండే పండుగ. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటిముందు రంగు రంగుల రంగవల్లులు ఇలా ఒక్కటేమి సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల గ్రామాలు సందడిగా మారిపోతాయి. మరోపక్క పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని చర్యలు చేపట్టిన పండుగ మూడు రోజులు మాత్రం పందాలు జరిగి తీరుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు.సంక్రాంతి పండుగ వేళ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు …

Read More »