ఆంధ్రప్రదేశ్

శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ అరుదైన పురాతన శిల్ప సంపద వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శివాలయ అభివృద్ధి పనుల సమయంలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు స్థానికులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. గురువారం శివాలయ పరిసరాల నుంచి మట్టిని తొలగించి …

Read More »

కమిషనర్ వద్దకు వచ్చిన బిక్షాటన చేసే బాలురు – ఏం అడిగారో తెలిస్తే మీ మనసు చివుక్కుమంటుంది

సారూ మాకు చదువు చెబుతారా! అంటూ భిక్షాటన చేసుకునే ఇద్దరు బాలురు కమిషనర్​‌ను వేడుకున్న దృశ్యం అందర్నీ చలించేలా చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ ‘మీకు తెలిసిన పెద్దవారిని తీసుకొచ్చి, పాఠశాలలో చేరండి’ అంటూ తన ఫోన్‌ నంబరును వారికి ఇచ్చి పంపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ వైవో నందన్‌ గురువారం వీఆర్‌ విద్యాసంస్థల ప్రాంగణాన్ని సందర్శించగా ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన బిక్షాటన చేసే అనాథ బాలురు పెంచలయ్య, వెంకటేశ్వర్లు “సార్‌ మాకూ చదువు చెబుతారా?” అంటూ …

Read More »

 ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

చిల్లంగి నెపంతో మహిళను దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. సొంత పిన్ని నన్ను వదిలిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుందని అర్థించినా  పైశాచికంగా కత్తిపీటతో వెంటాడి వేటాడి హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది. బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ దారుణ హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో నుంచి తీవ్ర గాయాలతో పెద్దపెద్ద కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అలా పరిగెత్తుతూ ఇంటి వెలుపల ఉన్న గుమ్మం వద్దకు వచ్చి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో, …

Read More »

సార్.. ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట నృత్య ప్రదర్శనంటే మామూలు విషయమా మరి.. అది కూడా తిరుమల ఆస్థాన మండపంలో నృత్యం చేసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఇంకేం భాగ్యం. కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ ఈ మేరకు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. అయితే అడ్డంగా దొరికి పోయాక …

Read More »

వైజాగ్ వాసులకు ఇది కదా కావాల్సింది.. డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.!

విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. సుందరమైన బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చూడముచ్చటైన పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూ ఉంటాయి. అందుకే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విశాఖ రావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. చల్లని అద్దాల బస్సుల్లో విహరిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో పర్యటించారు. విశాఖలో త్వరలోనే ప్రారంభంగానున్న …

Read More »

సరికొత్త రాజకీయ వ్యూహం.. మహిళకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు..? రేసులో ఆ ముగ్గురు..!

దేశవ్యాప్తంగా పుల్‌ స్వింగ్‌లో ఉంది కమలం పార్టీ..! వరుసబెట్టి విజయాలు సాధిస్తూ.. ఓ రేంజ్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్‌ ఎవరు..? అమిత్‌షా, రాజ్‌నాథ్, నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడెవరు..? అన్నదీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురిలో ఎవరా బిగ్ లక్కీ హ్యాండ్..? హ్యాట్రిక్‌ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్‌ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది. …

Read More »

ఆ గిరిజనులపై డిప్యూటీ సీఎంకు ‘మధుర’మైన అభిమానం..! ఈ సారి ఏం పంపించారంటే..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా గిరిజన గ్రామాలకు మరో గిఫ్ట్ పంపారు. కురిడి గ్రామస్తులకు మామిడిపండ్లు అందించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకున్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని వెంటనే సహాయం చేయడం ప్రశంసనీయం. గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాలో జీవనం.. అమాయక ప్రజానీకం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రెండు వందలకు పైగా గడపలున్న ఆ కుగ్రామం అమాయక ప్రజలకు నివాసం. అరకుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ.. అభివృద్ధికి …

Read More »

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ డైరెక్టర్‌ …

Read More »

ప్రశాంతంగా ముగిసిన మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడో తెలుసా?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగాయి. దాదాపు అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇప్పటికే ఆన్సర్ కీలు కూడా విడుదలైనాయి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి …

Read More »

సోనూ సూద్ మంచి మనసు.. ఈ వృద్ధ జంటకు చేసిన సాయం తెలిస్తే..

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ అందరికీ బాగా తెలుసు.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోవిడ్‌ కాలంలో సోషల్ వర్క్ ద్వారా ప్రజలకు దేవుడయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే గొప్ప గుణం సోనూ సూద్‌ది. తాజాగా మరోసారి అతను తన గొప్ప …

Read More »