ఆంధ్రప్రదేశ్

అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..

పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …

Read More »

రేపే అన్న క్యాంటీన్ల ప్రారంభం.. నారా భువనేశ్వరి భారీ విరాళం.. ఎంతో తెలుసా?

Nara Bhuvaneswari Donation for Anna canteens: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ …

Read More »

టీడీపీ నేత పోస్టుతో ఆగిన ఐఏఎస్ పోస్టింగ్?.. ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఇంకా జేసీగా రిపోర్టు చేయలేదు. అయితే ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టింగ్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. హరితను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు …

Read More »

భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్

అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ …

Read More »

ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష

ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు. అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు

ఏపీ ప్రజలకు శుభవార్త.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చని ప్రకటించింది. ఇటీవల ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపులకు డిస్కంలు గుడ్ బై చెప్పాయి. అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవటంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్‌ పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. ఏపీలో ఇకపై విద్యుత్‌పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌తో పాటు …

Read More »

దీనిపై కఠినంగా ఉండండి: చంద్రబాబు

జీవో 117పై నివేదిక ఇవ్వండి విద్యార్థులకు స్పోర్ట్స్‌ రిపోర్టులు ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఐడీ విద్యాశాఖలో సమూల మార్పులు సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి: విద్యా శాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబ్‌సలో మార్పులు చేయాలని సూచించారు. దీనికోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ప్రముఖులతో …

Read More »

ఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదే.. టైమింగ్స్‌తో సహా వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న (గురువారం) అన్న క్యాంటీన్‌ను కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద …

Read More »

ఏపీలో రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, రాయితీపై తక్కువకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్లీ వ్యక్తిగత రాయితీపై యంత్రపరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్‌స్ప్రేయర్లు, టార్పాలిన్లు, యంత్ర పరికరాలెన్నో రాయితీపై అందించనున్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఆదరణ చూపిస్తున్ారు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతోపాటు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ ఇవన్నీ ఉచితంగా ఇస్తారు

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్య పండగులకు కానుకలు అందించారు.. ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, చంద్రన్న రంజాన్‌ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్రాతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలను రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందిస్తారు. ఈ పథకానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం …

Read More »