ఆంధ్రప్రదేశ్

సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్‌కు బూమ్ వచ్చింది. మరి సామాన్యులకు గుడ్ న్యూస్ అందించేలా.. అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..ఏపీలో ఆరునెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బెలూన్‌కు గాలి ఊదినట్లుగా.. ఏపీలో రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలా ఒక్కసారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగి పడిపోతుంది …

Read More »

హ్యాట్సాఫ్.. మహిళా ఎస్సై..! మృతదేహాన్ని భుజాన వేసుకుని..!

విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతానికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని భుజాన మోస్తూ తీసుకెళ్లారు ఎస్ఐ సూర్యకళ.అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం …

Read More »

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

110 మంది పోలీసులు, 11 బ్రృందాలు 24 గంటలు పని చేస్తే కేసును ఛేదించడానికి ఏడు రోజులు సమయం పట్టింది.. కేవలం 7 తరగతి చదివిన తిరుమాని శ్రీధర్ వర్మ అలియాస్ చేకూరి శ్రీధర్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకే సవాల్ విసిరాడు. నేరం ఎలా చేయాలి, దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, పట్టుకున్నా శిక్ష పడకుండా ఎలా బయట పడాలి. ఈ త్రిముఖ వ్యూహంతో ఆపరేషన్ సిద్ధ – చేప పేరుతో క్రైం కథ నడిపాడు.ఏంటి ఈ ఆపరేషన్ సిద్ధ? ఉండి మండలం …

Read More »

పొలంలో సేద్యం చేస్తుండగా కనిపించిన వింత వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా

ఇక్కడ ఉన్న చిత్రాలలో మీరు చూస్తుంది ఏమిటో గుర్తుపట్టారా.? వాటిని తీక్షణంగా చూడండి. అస్తిపంజరం చేయి.. అలాగే కాలులాగ కనిపిస్తున్నాయి కదా. కానీ అవి అస్తిపంజరం చేయి, కాలు కాదు.. కానీ అవి నేలలో నుంచే వచ్చాయి. సేద్యం చేస్తుంటే రైతులకు కనబడటంతో మొదట భయపడ్డారు. ఆ రైతులు తర్వాత వాటిని తీక్షణంగా చూసి హమ్మయ్యా అనుకున్నారు. ఇంతకీ అవేంటంటే.?కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ పొలాలలో రైతులకు కొన్ని అస్తిపంజరంలోని చేయి, కాలు లాంటి భాగాలు కనబడ్డాయి. మొదట వాటిని …

Read More »

బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్‌ పోలీసులు. దానిలో భాగంగా.. విజయవాడ సిటీలో కొద్దిరోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్‌ వాడకుంటే జరిమానా విధించడంతోపాటు.. వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్‌ వినియోగంతోపాటు పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్‌ చలాన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. …

Read More »

ఓరి బాబోయ్.. అల్పపీడనం ముప్పు వీడనే లేదు.. ఈ లోపే

ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి…బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ …

Read More »

వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ.. వదిన ఆస్తి కోసమే కుట్ర! ఆ రెండో చెక్క పెట్టె ఎవరి కోసమో?

మహిళ ఇంటికి డెడ్ బాడీ హోం డెలివరీ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో శ్రీధర్ వర్మతోపాటు అతని రెండో భార్య, ప్రియురాలు హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వదిన తులసి ఆస్తి కాజేసేందుకు ఆమెను బెదిరించడానికే పర్లయ్యను హతమార్చినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు..పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్‌లో మృతదేహం కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వదిన తులసిని బెదిరించి, ఆమె ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ …

Read More »

 అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన …

Read More »

ఏటా ఆలస్యంగా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్‌.. ఏడాది ముగుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేటా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్య మవుతుండటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా విద్యా సంవత్సరం ముగుస్తున్న ఇంకా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ముగింపు వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా తరగతులు ఆలస్యంగా మొదలై చివరన …

Read More »

మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం.. శోకసంద్రంలో తెలుగువారు

మన్మోహన్‌ సింగ్ మృతితో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేశారు. ప్రతిష్టాత్మక పనికి ఆహార పథకాన్ని అనంతపురం వేదికగా ప్రారంభించారు. మరోవైపు మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో …

Read More »