అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లితోపాటు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. మరి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారా? పోలీసులు అడ్డుకుంటారా? ఏం జరగనుంది? అనేది ఆసక్తిగా మారింది. ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో …
Read More »వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రేగుల హైస్కూల్లో గురువారం తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థినులకు వడదెబ్బ తగిలింది . తరగతిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎనిమిది మంది విద్యార్థినులు వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. గుండె నొప్పి, చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలతో డీహైడ్రేషన్‌తో కళ్లు తిరిగి పడిపోయారు. పరిస్థితిని గమనించిన టీచర్లు వెంటనే స్పందించి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి జగ్గంపేట ప్రభుత్వాస్పత్రిలో, మిగిలిన ఆరుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారంతా ప్రమాదమునుంచి బయటపడినట్లు సమాచారం. ఈ …
Read More »ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారిందోచ్.. కొత్త తేదీలు ఇవే
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం …
Read More »టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు!
రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ వెస్టర్న్ రైల్వే (SWR).. హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ …
Read More »రాయలసీమ నీటి కష్టాలకు రామ్రామ్… నేడు హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి
సీమ ప్రజల నీటి నిరీక్ష ముగిసింది. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా మల్యాల నుంచి ఫేజ్ 1, 2 కింద 554 కిలో మీటర్ల మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించిన అనంతరం హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్నారు. ఆపై మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేస్తారు. నీటి విడుదల …
Read More »ఇక సర్కార్ బడులన్నింట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటికీ ఇక కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయం రానుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునర్ వ్యవస్థీకరించి, నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్ నిర్వహించి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టెమ్ కార్యకలాపాలు …
Read More »సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, …
Read More »బెజవాడలో పట్టపగలు జంట హత్యల కలకలం.. పరారీలో రౌడీ షీటర్!
విజయవాడలో నిన్న డబల్ మర్డర్లు చేసిన అనంతరం పరారైన రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేశాడు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు బంధువులకు కబురు చేయగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు.. విజయవాడ పట్టణంలో పట్టపగలు ఇద్దరు …
Read More »ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ముందే కట్టే పనిలేదు – సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఏపీలోని కూటమి సర్కార్ దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి …
Read More »ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన… రెండు రోజుల పాటు ఏమేం చేశారంటే…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు కీలక విషయాలపై వినతులు అందించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, మాండవీయ, నిర్మలాసీతారామన్, పాటిల్‌తో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి …
Read More »