తిరుమల పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అయితే మార్గ మధ్యలో ఆయన వెన్నునొప్పి కారణంగా ఇబ్బందిపడ్డారు. అయితే బుధవారం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించారు. అనంతరం తిరుమలోని అతిథి గృహంలో బస చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ …
Read More »విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే
విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్‌పూర్ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్‌లో రామగర్ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్‌ఐ సంయుక్తంగా …
Read More »విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అందజేశారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన …
Read More »హిందూపురం: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రైతు.. వారానికే షాకిచ్చిన భార్య, ఊహించని ట్విస్ట్!
ఆయనో రైతు.. 40 ఏళ్లైనా పెళ్లి కావడం లేదు.. ఎన్నో సంబంధాలు చూసినా కుదరడం లేదు. తల్లిదండ్రులు వృద్ధులు.. కొడుకు పెళ్లి చూడాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు.. మధ్యవర్తుల్ని సంప్రదించడంతో ఓ సంబంధం కుదిరింది. అతడికి వివాహం కూడా అయ్యింది.. కానీ ఆ తర్వాత ఊహించని పరిస్థితి ఎదురైంది. వారం తర్వాత తరువాత ఆమె అతడికి మస్కా కొట్టి వెళ్లిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన …
Read More »వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు
వైఎస్సార్‌సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. వాస్తవానికి …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. వాట్సాప్ ద్వారా దర్శనం టికెట్లు, పూర్తి వివరాలివే
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు సులభమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలకమండలిని నియమించే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత.. వచ్చే మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి.. ఆ తర్వాత మెల్లిగా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి …
Read More »తిరుమల లడ్డూ వివాదం.. అన్నవరం సత్యదేవుని ప్రసాదంపై కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదం తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలోని మిగిలిన ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఉపయోగించే సరుకులపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా ఆలయాల్లో తనిఖీ కూడా చేపట్టారు.. కొన్ని ఆలయాల్లో నాణ్యత లోపించినట్లు గుర్తించారు.. అక్కడ అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రసాదం తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని.. విజయవాడలోని విజయ డెయిరీ …
Read More »దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు.. దర్శనం వేళల వివరాలివే!
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దసరా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున గుర్తొచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల …
Read More »బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …
Read More »ఏపీలో ‘లులు’ను మేమే వద్దన్నాం.. కారణాలు ఏంటో చెప్పిన మాజీ మంత్రి బొత్స
ఆం ధ్రప్రదేశ్‌లో లులు ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. అయితే గత ప్రభుత్వం లులును వెళ్లగొట్టిందనే విమర్శలు రావడంతో.. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లులు గ్రూపు వెళ్లిపోవడానికి కారణాలను చెప్పారు. విశాఖలో లులు ప్రాజెక్టును …
Read More »