ఆంధ్రప్రదేశ్

బ్యాంకులో దుర్గమ్మ బంగారం డిపాజిట్.. ఎన్ని కిలోలు.. విలువ ఎంతంటే..?

బెజవాడ దుర్గమకు భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో దుర్గమ్మ బంగారాన్ని అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.5 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా భక్తులకు మరో గుడ్ న్యూస్‌ను కూడా ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకులో డిపాజిట్ …

Read More »

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని.. మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిందో భార్య. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో జులై 2న ఈ ఘటన జరగ్గా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనే వ్యక్తి జులై 2వ తేదీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో చంద్రశేఖర్‌ను హత్య చేసింది అతని భార్య రమాదేవిగా తేలింది. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడన్న …

Read More »

ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఈ కింద తెలుసుకుందాం.. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత …

Read More »

ఆపరేషన్ సింధూర్‌తో పెళ్లి వాయిదా.. ఆ ముచ్చట తీరకుండానే ఇలా..! ఆర్మీ జవాన్ కథ తెలిస్తే..

ఆపరేషన్ సిందూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్ రాజౌరీలో చనిపోయాడు. చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అవ్వడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరీలో విధుల్లో ఉండగా చేతిలో ఉన్న గన్‌ మీస్‌ఫైర్ అవ్వడంతో …

Read More »

వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. …

Read More »

అలా ఎలా నమ్మించావురా.. ఒంటరి మహిళ నుంచి రూ.28 కోట్లు కొట్టేసిన కేటుగాడు!.. ఎలాగో తెలిస్తే షాక్!

చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న కేటుగాడు, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు. డబ్బులు ఇచ్చిన కొన్నాళ్లకు నిందితుడి బండారం బయటపడడంతో మోసపోయినట్టు గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకొచ్చింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను రెండో పెళ్లి చేసుకొని, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు. ఆమె …

Read More »

గోవిందా గోవింద.. ఇకపై సాయంత్రం అన్నప్రసాదంలోనూ వడ

తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి.  తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. జులై 7 నుండి సాయంత్రం సెషన్‌లో కూడా వడలను టీటీడీ  భక్తులకు వడ్డిస్తోంది. మార్చి 6 నుంచి మధ్యాహ్న సమయంలో అన్నప్రసాదంలో వడను ఇస్తున్నారు. ఇప్పుడు రాత్రి భోజన సమయంలో …

Read More »

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం – ఏపీలో వానలే వానలు

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రమంతటా ఉంటాయని వివరించింది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు జూలై 07న ఉదయం 0830 గంటలకు నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది …

Read More »

రేషన్‌ పంపిణీలో కొత్త టెక్నాలజీ.. ఫోన్‌లో ఫోటో దిగితే చాలు.. వెంటనే రేషన్!

ఇకపై రేషన్‌ షాప్‌కు వెళ్లి బియ్యం కోసం గంటలు గంటలు నిలబడే అవసరం లేదు. ఎందుకంటే రేషన్‌ పంపిణీ వ్యవస్థలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది హిమాచల్‌ ప్రభుత్వం. అదే ఫేస్ అథంటికేషన్ వ్యవస్థ. ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది. ఒకప్పుడు రేషన్ ఎలా తీసుకునే వాళ్లం, రేషన్ ఫాప్‌కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యాన్‌వల్‌గా రాయించుకొని రేషన్ తీసుకునేవాళ్లాం. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ పాస్ యంత్రాల ద్వారా ఫింగర్‌ ప్రింట్‌ లేదా, ఐరిస్‌ స్కాన్‌ ద్వారా …

Read More »

పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట …

Read More »