ఆంధ్రప్రదేశ్

 అయ్యో అన్నదాత.. కిలో ఉల్లి 30 పైసల్.. మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని.. కిలో 30 పైసలు మాత్రమే ఉందని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం మార్కెట్ కు భారీగా ఉల్లి వస్తోంది.. క్వింటాల్ ఉల్లి 1200లకు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్‌.. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం …

Read More »

 అలర్ట్.. మెగా డీఎస్సీ -2025 తుది జాబితా విడుదల.. డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి

మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్ట్‌లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను (సెప్టెంబర్ 15) ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్పీ అధికారిక వెబ్‌సైట్‌లో https://apdsc.apcfss.in/ తుది ఎంపిక జాబితాను విడుదల …

Read More »

ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి.. ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం శనివారం 13 సెప్టెంబర్ 2025 IST 0830 గంటలకు విస్తరించి కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మట్టం ఎత్తుతో నైరుతి దిశగా …

Read More »

ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఈ అర్హతలుంటే చాలు

వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కేవలం విద్యార్హతల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 213 అడిషనల్ …

Read More »

జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి.. అమరావతిని కలుపుతూ రైల్వే శాఖ అదిరే ప్లాన్..

దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ సర్వే నిర్వహిస్తోంది. బుల్లెట్ రైలుతో హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. ప్రస్తుతం 12గంటల సమయం పడుతోంది. దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్‌ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి …

Read More »

‘నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను వాయిదా వేయండి..’ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

దక్షిణాది రాష్ట్రాల్లో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను ఒకటి, రెండు నెలలపాటు వాయిదా వేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో పీజీ మెడికల్ 2022 విద్యార్థులకు తుది పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను …

Read More »

అయేషామీరా హత్య కేసులో వీడని మిస్టరీ.. 18 ఏళ్లుగా దక్కని న్యాయం!

18 ఏళ్లుగా అయేషామీరా హత్య కేసు కోర్టులో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో న్యాయం మరింత ఆలస్య మవుతుంది. ఈ కేసును CBIకి అప్పగించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిలిపోయే పరిస్థితి నెలకొంది.. గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషామీరా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం నెలకొంది. 2007 డిసెంబర్‌ 27న రాత్రి లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిగా …

Read More »

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు. పల్లెల్లో చాలా మందికి కష్టకాలంలో ఆదుకునే పనిగా, కరువు పనిగా, మట్టిపనిగా పేరు తెచ్చుకున్న ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో కొంతమంది ఒకరి …

Read More »

 శతకం కొట్టి సెలబ్రేషన్స్‌కు ముందు పోలీసులకు చిక్కాడు..

చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో వందకు వందశాతం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి సక్సెస్ రీచ్ అయితే .. ఎంజాయ్ చేస్తుంటారు. పట్టుమని పదో తరగతి చదవకపోయినా.. మూడు పదుల వయస్సులోనే సెంచరీ దాటేశాడు. అందరూ ప్రొఫెషనల్స్ మాదిరిగానే శతకం సాధించాడు.. ఆ శతకానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణం …

Read More »

హైకోర్టు గ్రూప్ 1 తీర్పుపై డివిజ‌న్ బెంచ్‌కు టీజీపీఎస్సీ.. నిరుద్యోగుల్లో గందరగోళం

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యూయేషన్‌ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడుతుంది. గ్రూప్‌ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్‌లు జారీ చేశారు. …

Read More »