ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో మరో హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు రోజుల్లో అన్నదాత సుఖీభవ హామీకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. పాలనలో తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …
Read More »గుడివాడ వచ్చిన కొడాలి నాని – ఛాతికి ఆ బెల్డ్ ఎందుకు ధరించారో తెల్సా..?
టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు చెందిన దుకాణంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊరట లభించింది. ఆయనకు గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఛాతీకి బెల్టుతో కోర్టుకు వచ్చిన నాని.. బెయిల్ పత్రాలు సమర్పించారు. కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. మంగళవారం, శనివారం గుడివాడ పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. …
Read More »రూ.కోటికి.. రెండు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..దిమ్మతిరిగే ట్విస్ట్!
రద్దయిన రూ.2వేల నోట్లతో రెట్టింపు డబ్బును ఆశగా చూపి ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఓ వ్యాపారి నుంచి రూ.కోటి కాజేసి అడ్డంగా దొరికి పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73.20 లక్షల నగదు తోపాటు రెండు వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసిందిచలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి …
Read More »డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో …
Read More »హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!
గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు …
Read More »ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. మహిళ మృతి
కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్‌కు పెట్టగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ రాత్రి ఛార్జింగ్ కోసం ఉంచారు. అయితే.. ప్రమాదకరంగా వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది. వీటిని సరైన …
Read More »చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!
ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణీకుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన సంఘటన గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. …
Read More »అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఆమె.ఇటీవలె శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు మన తెలుగుమ్మాయి కూడా అంతరిక్ష యాత్ర చేయనుంది. అది కూడా అతి చిన్న …
Read More »శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో ఆటలు.. ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!
తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా …
Read More »డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ పవర్ …
Read More »