ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని …
Read More »తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …
Read More »వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు,
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై …
Read More »ఏపీలో 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. వెయిటింగ్‌లో ఉన్నవాళ్లకు పోస్టింగ్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వినీత్ బ్రిజ్‌లాల్, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాష్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులకూ పోస్టింగ్‌లు వచ్చాయి. ఎస్‌ఐబీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను సీఐడీకి బదిలీ చేశారు. బ్రిజ్‌లాల్ స్థానంలోకి పీఅండ్‌ఎల్ (ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స) ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను బదిలీ చేశారు. సెబ్ రద్దు కావడంతో సెబ్ ఐజీగా ఉన్న ఎం రవిప్రకాష్‌ను పీఅండ్‌ఎల్ ఐజీగా పోస్టింగ్ దక్కింది. విశాఖపట్నం …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఉచితంగా దర్శనం, వసతి.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే నవనీత సేవ మధ్యాహ్నం …
Read More »ఏపీలో పింఛన్లు తీకునేవారికి అలర్ట్.. ఇకపై వాళ్లకు అకౌంట్‌లలో డబ్బులు జమ, ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం.. ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది. ప్రతి నెలా వీరు పింఛన్ తీసుకునేందుకు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.. అందుకే వారికి పింఛన్ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ …
Read More »తెలంగాణకు భారీ వర్ష సూచన.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు అల్పపీడనం …
Read More »ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది.మరీ ముఖ్యంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. ఏపీలో నూతన విమానాశ్రయాల గురించి కీలక …
Read More »ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా …
Read More »