ఆంధ్రప్రదేశ్

రూ.1.34 లక్షల కోట్ల ఆదాయమే టార్గెట్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్‌లా మార్చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్‌ పెట్టేలా.. చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అభివృద్ధిలో ఏపీని టాప్‌లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? అవుతున్న ఖర్చు ఎంత? అనేదానిపై అధికారులతో లెక్కలు తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై …

Read More »

బిగ్‌ అలర్ట్‌.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు రేపటితో (మే 15తో) ముగియనుందని, అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్‌ ఇదే. కాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల …

Read More »

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎంఆర్‌ ఆధారితంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 2వ తేదీ, జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌-1), మ్యాథమెటిక్స్‌ (పేపర్‌-2) పరీక్షలు జూన్‌ 3న, జనరల్‌ ఫారెస్ట్రీ-1 (పేపర్‌-3), జనరల్‌ ఫారెస్ట్రీ-2 (పేపర్‌-4) పరీక్షలు జూన్‌ 4వ …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే  కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో …

Read More »

ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌.. రేషన్ కార్డుల జారీపై కీలక అప్‌డేట్!

రేషన్‌ కార్డు జారీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన 3.36 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు అధికారులు.2024 ఎన్నిలకల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా …

Read More »

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఆస్తి పన్ను రద్దు

దేశ రక్షణలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు అపూర్వమైనవి. అలాంటి వీర సైనికులను గౌరవించడం ప్రతి పౌరుని, ప్రతి ప్రభుత్వానికీ బాధ్యత. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేసే వారిని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా సాయం చేయడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మరింత ఆదరణ చూపుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు …

Read More »

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి, కుటుంబంలో విషాదం

కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి (70) కుటుంబంతో పాటు మరో రెండు జంటలు కలిసి ఈ నెల 18న టూర్‌కు బయల్దేరారు. అయితే పర్యటన మధ్యలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులు ఆ కుటుంబాలను విడదీసి, భయాందోళనలో ముంచెత్తాయి. చంద్రమౌళి జంట ఉన్న ప్రాంతంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాంతో ఆయన మిస్ అయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆరు మందిలో చంద్రమౌళి కనిపించకపోవడంతో …

Read More »

టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది.. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. …

Read More »

స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..

అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది. ఈ భారీ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ  తరహాలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర …

Read More »

వావ్‌.. వాటే ఐడియా గురూ.. సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్

ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!మొక్కల అద్దె.. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ! Ugaoo, Greenly లాంటి వెబ్‌సైట్లు, స్థానిక …

Read More »