ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఈ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎన్ని రోజులంటే!

Tirumala Darshans Cancelled: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల …

Read More »

ఏపీ మహిళలకు దీపావళి బొనాంజా ప్రకటించిన చంద్రబాబు.. ఆ రోజే ప్రారంభం

Chandrababu on Free Gas scheme in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌‍లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని …

Read More »

ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం కాబోతున్న అతిశీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆమె ఏపీలో టీచర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్‌ ఉంది. గతంలో ఆతిశీ ఆ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. ప్రతి నెలా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.1500

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ‌పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. సూపర్స్ సిక్స్‌‌లో భాగంగా.. …

Read More »

అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు

ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్‌ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ …

Read More »

గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్‌’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …

Read More »

తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపరాఫర్.. ఐడియా అదిరింది!

తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రాంరభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే రూ.లక్ష పైబడి సభ్యత్వం చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని నేతలకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.. వారందరితో మాట్లాడారు. ఈ సమావేశం మంగళవారం అర్ధరాత్రి వరకు సాగగా.. పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించారు. …

Read More »

యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …

Read More »

ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు

Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. …

Read More »