మృత్యువు.. అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. కటిక పేదరికంలో మగ్గుతున్న వాడైనా.. ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా.. మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఆ మృత్యు దేవతకు కూడా మనసంటూ ఉంటే.. దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక.. గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే …
Read More »అచ్యుతాపురం బాధితులకు చంద్రబాబు పరామర్శ.. వారికి రూ.50లక్షలు, రూ.25 లక్షలు ప్రకటన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలో బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు.. భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.. వారికి ధైర్యం …
Read More »ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలు ఉండవు, సింపుల్‌గా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్‌కు సమీపంలో ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »ఈ రోజుల్లో ఇలాంటి శిక్షలా..? మాజీ మావోయిస్టు చనిపోతే ఒక్కరూ రాలే..!
కాలం మారుతున్నా.. కొందరు దురాచారాలను మాత్రం వీడటం లేదు. కులం పేరుతో ఇప్పటికీ దారుణాలకు పాల్పడుతున్నారు. మనిషి బతికున్నప్పడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా వారిని హింసిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకునంది. ఓ మాజీ మావోయిస్టు చనిపోతే.. కుల కట్టుబాట్లకు తలొగ్గి ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. చివరకు డబ్బు కొట్టేవాళ్లు కూడా రాకపోవటంతో పక్క గ్రామం నుంచి రప్పించి రెండు కుటుంబాల వారే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం …
Read More »చంద్రబాబు సర్కార్ పెద్ద మనసు.. అచ్యుతాపురం ఘటన మృతులకు రూ.కోటి పరిహారం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.. వారికి కూడా పరిహారం అందజేస్తామన్నారు. మరోవైపు కేంద్రం తరఫున కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలియజేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు …
Read More »ఏపీలో బైక్‌లు నడిపేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై అలా కుదరదు, హైకోర్టు సీరియస్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోడ్డు ప్రమాదాలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్ ధరించని వాహనదారులపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని తెలిపింది. విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం లేదని.. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని తామిచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాదు చట్ట నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హెల్మెట్ ధరించనివారికి వారు జరిమానా విధిస్తున్నట్లు తాము …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మూడు రోజులు ఈ సమయంలో దర్శనాలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు కీలకమైన సూచన చేశారు. దుర్గమ్మకు నివేదన సమర్పించే సమయంలో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. అందుకే ఆ సమయంలో ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటోంది. ఉదయం 11.30 నుంచి …
Read More »చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్ కన్సెంట్ (సాధారణ సమ్మతి) ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే.. ఏపీ భూభాగంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు, అమలు చేసేందుకు వీలు ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. …
Read More »