ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాలో పెరుగుతున్న GBS కేసులు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఐదుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందంటున్నారుఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతుంది. నాలుగు రోజుల్లో ఏడుగురు బాధితులు గుంటూరు జిజిహెచ్‌కు చికిత్స కోసం వచ్చారు. వీరిలో ఇద్దరు …

Read More »

వాలెంటైన్స్ డే కాదు..సరికొత్త నినాదం ఎంచుకున్న వీహెచ్‌పీ, విశ్వహిందూ పరిషత్..!

ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే.. అయితే ఇది మన కల్చర్ కాదంటున్నాయి భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలు. వాలెంటైన్స్ డే కాదు.. వీర జవాన్ల దినోత్సవం అంటోంది భజరంగ్‌ దళ్. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి వీల్లేదంటున్నాయి. ప్రేమ జంటలు కనిపిస్తే.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామంటున్నాయి. పేరెంట్స్‌కు సైతం ఇన్‌ఫామ్ చేస్తామంటున్నారు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు.ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికులు బయట, పార్కుల్లో తిరగాలంటే భయపడతారు. ఎందుకంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు కనిపించిన యువ జంటలకు పెళ్లి చేయిస్తారని భయం..! పార్కులు రోడ్ల వెంట జంటలు కనిపిస్తే …

Read More »

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి! మరో రెండు నెలల్లో పెళ్లి..

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను …

Read More »

 ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.  ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్‌ అలర్ట్‌ అయ్యింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు …

Read More »

కృష్ణలంక పీఎస్‌లో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్.. వంశీపై ప్రశ్నల వర్షం

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్‌.. ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. అయితే…కృష్ణలంకలో క్వశ్చన్ అవర్‌ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు…? ఏమిటి…? ఎలా…? అంటూ …

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

దాదాపు ఏడాది తర్వాత గ్రూప్‌ 2 అభ్యర్ధులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రిలిమ్స్‌ తర్వాత అతీగతీ లేకుండా పోయిన మెయిన్స్‌ పరీక్షలను ఎట్టకేలకు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా తాజాగా హాల్‌ టికెట్లను కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లో మరో రెండు వారాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనుంది..ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) జారీ చేసింది. త్వరలో …

Read More »

మరికాసేపట్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ 2025 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి ఈ రోజు విడుదల చేయనుంది. ఆయా ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌లను ప్రకటించనుంది. గతకొంత కాలంగా షెడ్యూల్‌ విడుదలకు తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి గురువారం (ఫిబ్రవరి …

Read More »

చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లు! భయంతో వణుకుతున్న జనం..

బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయాని అధికారులు ప్రకటించడంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే.. కొన్ని చోట్లా వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్లు వీడియోలు బయటికి వస్తున్నాయి. దీంతో జంన మరింత భయపడుతున్నారు.ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్‌ తినాలంటేనే వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్‌ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్‌ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి …

Read More »

ఏపీలో బర్డ్ ప్లూ టెర్రర్.. మనిషికి సోకిన వైరస్

ఏపీలో బర్డ్‌ ఫ్లూ విజృంభణ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలెర్టయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని.. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్‌ మాలిని.ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ప్లూ టెర్రర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోళ్లకు మాత్రమే ఈ ప్లూ సోకగా.. …

Read More »

కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని …

Read More »