కార్తీక మాసం పుణ్యమాని కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. మాంసాహారినిక సరిసమానంగా కూరగాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయినా బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు. దీంతో ఈ నెల మొత్తం శాఖాహారమే తీసుకుంటారు. దీంతో ప్రతీయేట ఈ మాసంలో చికెన్, మటన్ ధరలు తగ్గుతుంటాయి. ఇక ఈసారి కూడా చికెన్ ధర రూ.180కి చేరింది. …
Read More »చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్ సెల్లార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …
Read More »Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్ అశోక్‌పై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో …
Read More »వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా
Urvil Patel: ఉర్విల్ పటేల్ గుజరాత్‌కు చెందిన క్రికెటర్. 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికైన ఈ యువ స్ట్రైకర్‌కు ఆడే అవకాశం రాలేదు. అలాగే, ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన 26 ఏళ్ల ఉర్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత తుఫాన్ సెంచరీతో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలను పశ్చత్తాపడేలా చేశాడు. దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును …
Read More »PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్‌లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలుజాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో …
Read More »Ashwini Vaishnaw: వాళ్ల సంగతి చూడాల్సిందే.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదేరకమైన వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కించపర్చేలా పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. నాయకులను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు సైతం …
Read More »AP Mega DSC 2024 New Syllabus: టీచర్ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ కొత్త సిలబస్ వచ్చేసింది! డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. ఇప్పటికే కొన్ని కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ సిలబస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్ నవంబర్ 27 (బుధవారం)వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ను పాఠశాల …
Read More »ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..
ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన …
Read More »Serial Killer: వామ్మో.. సికింద్రాబాద్ రైళ్లలో సీరియల్ కిల్లర్.. 35 రోజుల్లో 5 హత్యలు
గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న రైలులో వికలాంగుల బోగీలో ఓ మహిళ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య చేసింది సీరియల్ కిల్లర్ గా పోలీసులు గుర్తించారు. ఇతగాడు రైళ్లలో ప్రయాణిస్తూ ఇదే మాదిరి పలు రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు.. ఓ సైకో రైళ్లలో ప్రయాణిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. తెలివిగా ఇతగాడు రైళ్లలోని చివరిభోగీలో ఉండే వికలాంగ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇలా ఏడాది …
Read More »విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు డిసెంబర్ సెలవులు ఇవే
దసరా నుంచి పాఠశాలలకు సెలవుల సీజన్ స్టార్ట్ అయినట్లే భావిస్తారు పిల్లలు. అక్టోబర్ తర్వాత నవంబర్ అంతా బడికి వెళ్లిన స్టూడెంట్స్ కు డిసెంబర్ మళ్లీ సెలవుల సంతోషాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. డిసెంబర్ నెలలో దాదాపు 9 రోజులు హాలీడేస్ వస్తున్నాయి. అందులో 7 పక్కా కాగా.. రెండు మాత్రం కొన్ని స్కూల్స్ వాటి ప్రాధాన్యతను బట్టి ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇక మిషనరీ స్కూల్స్ మాత్రం 10 రోజులు హాలీడేస్ వస్తున్నాయి. డిసెంబర్ నెలలో స్కూల్ పిల్లలకు ఎగిరి గంతేసేలా సెలవులు వస్తున్నాయి. …
Read More »