YSRCP Office Demolished in Eluru: ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపై మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆళ్ల నాని.. కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి …
Read More »పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,
ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …
Read More »జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …
Read More »అనకాపల్లి జిల్లాలో అరుదైన పురుగు.. ధర ఏకంగా రూ.75 లక్షలు?, ఎందుకంత డిమాండ్!
ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోనాంలో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కీటకం ధర రూ.75 లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కీటకానికి అంత ధర ఏంటి అని షాకవ్వకండి.. ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలు కలిగిన అరుదైన కీటకం స్టాగ్ బీటిల్ అని చెబుతుంటారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధర కంటే …
Read More »విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ యాప్‌లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపటిలాగే.. మొబైల్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు కట్టేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా.. జులై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు.. థర్డ్ పార్టీ యాప్‌లలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, …
Read More »చంద్రబాబు హామీ.. 24 గంటల్లోనే డ్రైవర్‌కు ఆటో అందజేత.. ఆసక్తికర సన్నివేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గురువారం గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్‌తో మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు …
Read More »Tirumala: శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ.. ఈ హుండీ ప్రత్యేకతలు ఇవే!
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆ వడ్డీకాసులవాడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంత మంది తమకు వీలైనంత మేరకు ధన, వాహన, వస్తు రూపేణా శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసే టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందిస్తుంటారు. ఇంకొంతమంది తిరుమల ఆలయానికి నగలు, వస్తువులు బహుమానంగా అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహుమతిగా అందింది. కొప్పెరవారిపల్లికి చెందిన కామినేని శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి కుప్పెర …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్తే భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు దర్శన వేళల్లో మార్పు, ఆర్జిత సేవలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.. ఈనెల 17 నుంచి 20వతేదీ (శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు ఆలయ అధికారులు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు దుర్గమ్మ ఆలయంలో ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 18వ తేదీ …
Read More »అన్న క్యాంటీన్‌లలో తొలిరోజు ఎంతమంది తిన్నారంటే.. ఏడాదికి ఖర్చు ఎంతో తెలుసా!
ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అన్న క్యాంటీన్లు (100) ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు. వీరిలో అల్పాహారం 32,500, మధ్యాహ్న భోజనం 37,500, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువశాతం …
Read More »ఆధార్ లేని వారికి అలర్ట్.. ప్రత్యేక క్యాంపులు.. ఎప్పటి నుంచి అంటే?
మనదేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకూ ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకూ అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా …
Read More »