ఇంటింటికి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తానకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తెలియకుండా తానేవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆదోని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్థసారథి. ఈ క్రమంలో ఈయన తాజగా ఇంటింటికి పార్థసారథి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా …
Read More »అగరబత్తులపై 60 యోగాసనాలు.. ఆయన ట్యాలెంట్ చూస్తే మతి పోవాల్సిందే!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ అగరబత్తులపై 60 యోగా ఆసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. యోగా అనేది ప్రతి ఒక్కరి దిన చర్యలో ఒక భాగం కావాలనే సందేశంతో చిత్రకారుడు కోటేష్ గీసిన ఆసనాల చిత్రాలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా నంద్యాల పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు కోటేష్ సైతం తన చిత్రకళతో …
Read More »పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపిలో ప్రతి చోట యోగాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వినూత్న ఆలోచనకు రూపం వచ్చింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖాళీ స్థలం ఉంది ఎంతో కాలంగా అక్కడ మట్టి పేరుకుపోయి ఉంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ అరుదైన శిల్పాక్రుతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ …
Read More »కొట్లాడితే ఏమొస్తుంది.. కూర్చుని మాట్లాడుకుంటే పోలా.. బేసిన్‌లో నీళ్లకు భేషజాలు ఎందుకు?: సీఎం రేవంత్
కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోద్ది కదా. బేషజాలకు పోతే ఏమొస్తుంది. బేసిన్ల లెక్కలు తేల్చుకోవడమే కదా కావాల్సింది. రండి.. మాట్లాడుకుందాం.. నీటి వాటాలపై క్లారిటీకి వద్దామంటూ.. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ ఏదైనా ఉందంటే.. అది జల జగడమే. గోదావరి, కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏపీ బనకచర్ల ప్రతిపాదనతో జల జగడం మరింత ముదిరింది. ఈ ప్రాజెక్ట్‌తో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి …
Read More »యోగా.. యావత్ భారతావనికి దక్కిన గౌరవం.. యోగా సాధకులు మాత్రమే ఒత్తిడిని జయించగలరు- పవన్ కల్యాణ్!
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం యోగాలో పాల్గొనే వారి కోసం ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు అనే కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇక ఈ …
Read More »రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగా మన జీవితంలో భాగం..
11వ అంతర్జాతీయ యోగాడే రికార్డు నెలకొల్పబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 12 లక్షల ప్రాంతాల్లో ఇవాళ యోగా చేస్తున్నారన్నారు. అలాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు. నిన్న 22వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు. ప్రతిరోజూ గంటసేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. …
Read More »యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది..! యోగాంధ్ర 2025లో ప్రధాని మోదీ
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసి.. యోగాంధ్రలో పాల్గొన్నారు. విశాఖలోని INS చోళ నుంచి ఆర్కే బీచ్ దగ్గరకు చేరుకున్న మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం …
Read More »జగన్ రప్పా రప్పా కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్
జగన్ రప్పా రప్పా కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందే.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదన్నారు పవన్ కల్యాణ్. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను …
Read More »వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ హుండీ నుంచి 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది. అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది. ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని, అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు. ఈ సమాచారం అందుకున్న …
Read More »విశాఖలో యోగా డేకి భారీ ఏర్పాట్లు.. రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగాంధ్రతో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా విశాఖలో 30 కిలోమీటర్లు పరిధిలో దాదాపు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశారు.. శనివారం విశాఖలో నిర్వహించే యోగా డే …
Read More »