విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అక్కడ జగన్ దాదాపు గంటసేపు గడిపారు. స్వామిజీతో చర్చించిన అంశాలను వెల్లడించలేదు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ వెళ్లిపోయారు. జగన్‌తో వెంట వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా …
Read More »AP News: ఇద్దరు ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి.. కోనసీమలో సందడే, సందడి
ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ శిక్షణలో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లిని ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడి స్వగ్రామం ఈ పెళ్లి వేడుకకు వేదిక అయ్యింది.. సందడి వాతావరణం కనిపించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన తరెట్ల ధర్మారావు ఐఏఎస్ అధికారి.. మధ్యప్రదేశ్‌లో కమిషనర్ స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ …
Read More »ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ సునీత.. కారణం ఏంటంటే!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది. గతవారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు.. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై …
Read More »వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ.. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని.. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి …
Read More »ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం – 1986కు సవరణను చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ ఆమోదించగా.. హెల్త్ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించింది. వర్సిటీ బోర్డులో కుష్ఠు రోగులు, చెవిటి, మూగ సమస్యలు కలిగిన వారు సభ్యులుగా చేరేందుకు అర్హులు కాదని విశ్వవిద్యాలయం చట్టంలో పేర్కొన్నారు. అయితే వీరిపై వివక్ష చూపరాదంటూ ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …
Read More »పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో వాలంటీర్ల ట్విస్ట్, కోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట దక్కింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని ఎన్టీఆర్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రత్యేక …
Read More »ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ)లో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఆ శాఖ ఎండీ చెక్ పెట్టారు. పొరుగుసేవల కింద పనిచేస్తున్న 45 మందిని.. అంతేకాదు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న 50 మందిని తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగించారు. ఈ 95మందికి ఐదేళ్లపాటు జీతాలు చెల్లించడంతో ఏపీఎండీసీపై అదనపు …
Read More »TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత …
Read More »ఎంతమంది పిల్లలు ఉన్నా ఓకే.. కీలక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ నిబంధనలు మార్చే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను మారుస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో మున్సిపల్, శాసనాల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ …
Read More »