ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో అఘోరీ రచ్చ రచ్చ.. పోలీసులపై దాడికి యత్నం.. చివరకు అలా..

రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న అఘోరీ సోమవారం మంగళగిరిలో హంగామా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జాతీయ రహదారిపై హల్‌చల్ చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై బైఠాయించిన అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరి జనసేన కార్యాలయంలో లేరు. ఇదే విషయాన్ని అఘోరీకి చెప్పిన పోలీసులు అక్కడి …

Read More »

అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను …

Read More »

ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మకు షాక్.. నో చెప్పిన ధర్మాసనం, కీలక ఆదేశాలు

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. సోమవారం హైకోర్టులో పిటిషన్ పై విచారణ చేయగా.. పిటిషనర్‌కి నోటీసులు జారీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ లాయర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించగా.. పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారన్న ఆర్జీవీ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. వాస్తవానికి మద్దిపాడు …

Read More »

తాడిపత్రి: తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలో నవ వధువు మృతి, మాటలకందని విషాదం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాద ఘటన జరిగింది. తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలో నవ వధువు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.. వీరిలో పెద్ద కూతురు గీతావాణికి పెళ్లి కుదిరింది.. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్‌వీ ఫంక్షన్‌ హాలులో ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. వధువు గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రి వెళ్లారు. అక్కడ పనులు చక్కబెట్టుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి …

Read More »

విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు

నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు. ఈ నెల 16న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, …

Read More »

కర్నూలు: హాస్టల్‌ కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9మందికి అస్వస్థత, కారణం తెలిసి షాక్

కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసి ఆకతాయి పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు సి క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌ ఉంది. ఈ వసతి గృహంలో వివిధ తరగతులు చదువుతున్న 30 మంది ఉంటున్నారు. వీరిలో ఒక పీజీ విద్యార్థి కూడా ఉండగా.. విద్యార్థుల మధ్య అతడు తరచూ వివాదాలకు కారణం అవుతున్నాడు. హాస్టల్‌లో విద్యార్థుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా పీజీ విద్యార్థి, మరో 8వ తరగతి చదువుతున్న మరో బాలుడితో కలిసి మాస్టర్ ప్లాన్ …

Read More »

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు, ఎందుకంటే

ఏపీలో సంచలన రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ సమక్షంలో ఇవాళ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 2021లో కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ఇప్పుడు వాంగ్మూలం రికార్డు …

Read More »

ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్చారు, పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు. అకడమిక్‌ కేలండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది పాఠశాల విద్యా శాఖ. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు (హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌) స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …

Read More »

ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు సులభతరం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

మనదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సిందే. అన్నింటికీ అదే ఆధారం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి గుడిలో దైవ దర్శనాల వరకూ అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే. మరీ చెప్పాలంటే భారతీయులకు ఆధార్ కార్డు అనేది ఓ నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ దుకాణాల నుంచి మొదలుపెడితే.. సిమ్ కొనాలంటే సెల్ ఫోన్ దుకాణాల వరకూ ఆధార్ లేనిదే పని జరగని పరిస్థితి. ఇక వయస్సు ధ్రువీకరణ కోసం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ …

Read More »