విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు దుర్గామల్లేశ్వర దేవస్థానంలో హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 18 రోజులకుగాను అమ్మవారికి కానుకల రూపంలో రూ.2,97,47,668 నగదు సమకూరింది. అంటే రోజుకు సగటున రూ.16,62,648 చొప్పున నగదు రూపంలో కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 410 గ్రాములు, వెండి 5 కిలోల 280 గ్రాములు భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మ హుండీలలో విదేశీ కరెన్సీ కూడా …
Read More »మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు, చిక్కులు తప్పవా!
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీపంట్నలోని రమేష్ నివాసంలో 15మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్‌కు సంబంధించి సీఐడీ స్వాధీనంలో ఉన్న రూ.5కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూమి …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. 3 నెలల్లో ఆస్తులు పెరిగాయి
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 1.45 గంటలకు 3 సెట్ల పత్రాలను పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్‌కు అందజేశారు. నామినేషన్ సమయంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నారు. బొత్స సత్యనారాయణ వెంట మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, …
Read More »తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!
తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, …
Read More »పంద్రాగస్టు గణతంత్ర దినోత్సవం.. వైరలవుతున్న వీడియోలో పవన్ అన్నది నిజమే.. కానీ!
ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా తయారైందంటే.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. నిజానిజాలు పక్కనబెడితే కొన్ని వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాస్తవం సంగతి దేవుడెరుగు.. ఆసక్తికరంగా అనిపించిందే తడవుగా ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేసేస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని.. పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం అన్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్ …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం
CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు కళ్యాణోత్సవం రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని ఆగస్ట్ 18న తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్ట్ 18న నిర్వహించే కళ్యాణోత్సవాన్ని రద్దుచేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆగస్ట్ 18న కళ్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మరోవైపు ఆగస్ట్ …
Read More »చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …
Read More »మంత్రి నారా లోకేష్ పేరుతో డబ్బుల కావాలని మెసేజ్.. పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు లోకేష్ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నేత బెజవాడ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మొబైల్ వాట్సాప్‌కు మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్‌గా ఉంది.. శుక్రవారం విజయవాడలోని పటమటకు చెందిన ఆర్.వేణుకు ఆ వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో తనను నారా …
Read More »వరుడి ఘనకార్యంతో చివరి నిమిషంలో ఆగిన పెళ్లి.. ఇదేం ట్విస్ట్ బాసూ!
కళ్యాణ మండపంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు.. బంధువులు, స్నేహితలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో కొత్త జంట ఒక్కటి కాబోతోంది.. ఇంతలో ఊహించని పరిణామం కనిపించింది. ఓ యువతి కళ్యాణ మండపంలోకి దూసుకొచ్చింది.. నేరుగా వరుడి దగ్గరకు వెళ్లింది. ఆెమ దగ్గర మారణాయుధం చూసి అందరూ అవాక్కయ్యారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటపడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని నందలూరులో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు.. తిరుపతికి చెందిన జయ …
Read More »