ఆంధ్రప్రదేశ్

‘50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్’.. సీఎం సంచలన ఆరోపణలు

బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని (Karnataka) కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసి సభలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా …

Read More »

అందులో తప్పేముంది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని …

Read More »

విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?

RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు …

Read More »

అమరావతికి మహర్దశ.. కేంద్రం సమక్షంలో చర్చలు.. రూ.వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ (ADB) బ్యాంక్‌లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సీఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ చర్చల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేయగా.. ఈ రుణానికి సంబంధించి ఎంవోయూ జరగలేదు. అయితే ఈ రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు విధించిన …

Read More »

చంద్రబాబుకు మరో గౌరవం.. దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా..

మన పెద్దోళ్లు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయని.. ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో.. ఏ జ్యోతిష్యుడు కూడా కచ్చితంగా చెప్పలేడు. ఇవాళ అట్టడుగున ఉన్నవారు.. రేపటికల్లా అందలం ఎక్కొచ్చు. కాకపోతే మనవైపు ఉండాల్సిందల్లా ప్రయత్నమే. ఆ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే.. మనకంటూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలౌతాయనే సామెత రాజకీయాలకు …

Read More »

కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 17న (ఆదివారం)న తిరుమలలో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు. శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల …

Read More »

TATA Group: ఏపీకి టాటా గ్రూప్ బంపరాఫర్.. టీసీఎస్‌ మాత్రమే కాదు అంతకు మించి..!

Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, …

Read More »

AP Weather: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో భారీ వానలు.. బీ అలర్ట్

ఏపీవాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని …

Read More »

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనకే అవకాశం.. చీఫ్ విప్ పదవి ఎవరికంటే, జనసేన నుంచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్‌ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు …

Read More »