ఆంధ్రప్రదేశ్

అక్రమ మైనింగ్ కేసులో ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్

క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సొమవారం ఉదయం వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరొకరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి …

Read More »

నైరుతి రుతుపవనాల రాక.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా …

Read More »

ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి 50 కి.మీ. దూరంలో ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పని చేస్తోంది.సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉన్న 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పూర్తి …

Read More »

వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!

కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో …

Read More »

ఏపీ ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్‌ అర్హతతో బీటెక్‌లో అడ్మిషన్

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల …

Read More »

రూ.1.34 లక్షల కోట్ల ఆదాయమే టార్గెట్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్‌లా మార్చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్‌ పెట్టేలా.. చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అభివృద్ధిలో ఏపీని టాప్‌లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? అవుతున్న ఖర్చు ఎంత? అనేదానిపై అధికారులతో లెక్కలు తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై …

Read More »

బిగ్‌ అలర్ట్‌.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు రేపటితో (మే 15తో) ముగియనుందని, అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్‌ ఇదే. కాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల …

Read More »

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎంఆర్‌ ఆధారితంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 2వ తేదీ, జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌-1), మ్యాథమెటిక్స్‌ (పేపర్‌-2) పరీక్షలు జూన్‌ 3న, జనరల్‌ ఫారెస్ట్రీ-1 (పేపర్‌-3), జనరల్‌ ఫారెస్ట్రీ-2 (పేపర్‌-4) పరీక్షలు జూన్‌ 4వ …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే  కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో …

Read More »