ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను, …
Read More »శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!
శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్ రియాల్స్, 90 థాయిలాండ్ …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు …
Read More »ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. …
Read More »ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …
Read More »టీడీపీకి షాక్.. క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గానూ ఐదింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం ఐదు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాల అనంతరం ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే …
Read More »చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రశంసలు.. ఇదే పద్ధతి ఫాలో కావాలని సూచన
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా పోటీకూడా చేశాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గురువారం ఉమ్మడి …
Read More »శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఓ ఉద్యోగి సిగ్గు లేకుండా..?
శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు
తిరుమల శ్రీవారి ఎస్ఎస్డీ టైం స్లాట్ టోకెన్లు వారానికి 1.47 లక్షలు జారీ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. అలిపిరి నుంచి విజిలెన్స్, అటవీశాఖ అధికారుల కొన్ని సూచనలు ఉన్నాయని.. త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చూస్తామన్నారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో.. టీటీడీ ఈవో జే శ్యామల రావు భక్తుల వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల దగ్గర నుంచి ప్రశంసలు వచ్చాయి. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు …
Read More »ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెన్షన్లు జమ చేసింది. ఆగస్టు 1నే జీతాలు జమ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.. ఓ ఉద్యోగి వీడియోను ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు.. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్ధ పాలనకు నిదర్శనం’ అన్నారు. ఒకటో తేదీన జీతాలు పడ్డాయంటూ ఓ ఉద్యోగి పలకపై రాశారు.. గురువారం ఉదయం 7.45 నిమిషాలకు జీతం అకౌంట్లో …
Read More »