పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ అనిల్ …
Read More »ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో స్టూడెంట్ అరెస్ట్.. అందుకేనట
నూజివీడు త్రిపుల్ ఐటీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎం.టెక్ విద్యార్థి పురుషోత్తం, సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు. సహచర విద్యార్థులు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు. నూజివీడు త్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఎంటెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తంను పోలీసులు …
Read More »ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. స్థానికులకు అడ్డంగా దొరికిన యువకుడు.. కట్‌చేస్తే..
కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ …
Read More »పెట్రోల్‌ట్యాంక్‌పై పడిన పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు.. అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది!
విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఆదివారం మధ్యాహ్నం HPCL పరిధిలో ఉన్న EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్తా ఫ్యాక్టరీ పరిసరాల్లోకి వ్యాపించాయి. దీంతో కంపెనీ వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? లేదా అన్నది …
Read More »ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?
AP CET’s Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2025 ప్రవేశాలు.. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను విడుదల చేసింది. …
Read More »వియోనా ఫిన్‌టెక్‌కి NPCI ఆమోదం.. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు కొత్త ఊపు
హైదరాబాద్ స్టార్టప్ వియోనా ఫిన్‌టెక్‌కి NPCI ఆమోదం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. వియోనా రూపొందించిన గ్రామ్‌పే ప్లాట్‌ఫారమ్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి పారదర్శక ధరలు, వేగవంతమైన చెల్లింపులను అందించనుంది. హైదరాబాద్‌కి చెందిన వియోనా ఫిన్‌టెక్ అనే స్టార్టప్ పెద్ద ముందడుగు వేసింది. ఈ సంస్థ గ్రామ్‌పే, వియోనా పే యాప్‌లను రూపొందించింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ …
Read More »అదిరిపోయే ప్లాన్ అంటే ఇదే.. ఏనుగులు, చిరుతలపై ఏఐతో ఫోకస్.. ఎలా ట్రాక్ చేస్తారంటే..?
ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. మనుషులపైకి దాడులకు సైతం దిగాయి. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమైంది. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అలాగే తిరుమల అడవుల్లో చిరుతల కదలికలను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక …
Read More »8వ తరగతి విద్యార్ధులకు తీపికబురు.. ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!
2025-26 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేదింటి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) కింద ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో.. కేంద్ర ప్రభుత్వం యేటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) కింద పేదింటి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి …
Read More »గుళ్లో హుండీ మాయం.. నెల తర్వాత ఊహించని సీన్! అంతా అమ్మవారి మహిమే..
భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు. ఓ దొంగల ముఠా కాపుకాసి ఏకంగా దేవుడి గుడిలోనే చోరీ చేశారు. భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు …
Read More »జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం.. ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై నారా లోకేశ్ ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ జరగగా.. పలు కీలక అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) సెమీకండక్టర్ యూనిట్‌ను ఆమోదించినందుకు మంత్రి లోకేశ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఇది …
Read More »