ఏపీ లిక్కర్ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఏప్రిల్ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని.. కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం …
Read More »ప్రాజెక్టులకు జలకళ… కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండు కుండను తలపిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నది, గోదావరి నది కింద ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండడంతో 11 గేట్లు ఎత్తివేత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ తుంగభ్రదకు ఇన్ ఫ్లో 42వేల 290 క్యూసెక్కులు కాగా.. …
Read More »ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్ వస్తువులను కిట్ రూపంలో …
Read More »గురుకుల విద్యార్ధులకు భలే ఛాన్స్.. నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ …
Read More »నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష..
సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టులు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన …
Read More »పవన్ కల్యాణ్ సవాల్ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించారు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. …
Read More »బీ కేర్ ఫుల్ తమ్ముళ్లు..! గీత దాటితే మంత్రి పదవి ఉండదు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
బీ కేర్ ఫుల్ తమ్ముళ్లు…! లైన్ క్రాస్ చేశారో ఇక దబిడిదిబిడే..! సబ్జెక్ట్ నేర్చుకోండి.. సబ్జెక్ట్‌పైనే రాజకీయాలు చేయండి..! కాదుకాడదూ ఇష్టం వచ్చింది మాట్లాడతాం, నచ్చినట్లు చేస్తాం.. అనంటే ఇక రోజులు లెక్కపెట్టుకోండని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు.. అభివృద్దే లక్ష్యం.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. గీత దాటి ఎవరైనా మాట్లాడితే నెక్ట్స్ డే మంత్రి …
Read More »వైభవంగా అప్పన్నగిరి ప్రదక్షిణ.. భక్తులతో కిక్కిరిసిన సింహగిరి రహదారులు .. 32 కి.మీ. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు..
విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం గోవింద నామ స్మరణతో మారుమోగుతోంది. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గిరిప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలిపావంచా దగ్గర ప్రారంభమైన …
Read More »దేశం ఖ్యాతిని పెంచిన తాపీ మేస్త్రీ కూతురు.. వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు గోల్డ్ మెడల్స్..
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది విజయనగరం జిల్లాకు చెందిన యువతి. కడు పేదరికంలోనూ ఏషియన్ జూనియర్ వెయింట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో మూడు బంగారు పతకాలు సాధించి దేశం ఖ్యాతిని పెంచింది. చిన్న పల్లెటూరు నుంచి అంతర్జాతీయ వేదిక దాకా సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పేదరికంలో పుట్టిన ఆ యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నిలిచింది. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవని స్థితి నుండి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంకు చెందిన …
Read More »కరీంనగర్ టూ తిరుమల.? తక్కువ ఖర్చుతో నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..
మీరు కరీంనగర్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా.? కానీ ఖర్చు విషయంలో వెనకాడుతున్నారా.? అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ కోసం ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) బడ్జెట్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం.. ఐఆర్సిటిసి ప్రకటించిన ప్యాకేజీ పేరు కరీంనగర్ నుండి తిరుపతి. దీని SHR005A. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి, శ్రీ కాళహస్తి కవర్ అవుతాయి. అయితే ఈ టూర్ ప్రతి గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ …
Read More »