ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన …

Read More »

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా …

Read More »

యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా.. కాకినాడ కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు

దిగ్గజ సంస్థ, ఐఫోన్ ఉత్పత్తి కంపెనీ యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఐఫోన్‌ కొనుగోలు చేస్తే ఇయర్‌ పాడ్స్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటన చూసి తాను మోసపోయాయని ఓ యువకుడు యాపిల్‌‌పై మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. ఫోన్ కొంటే తనకు ఇయర్‌ పాడ్స్‌ ఇవ్వలేని అతడు ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు …

Read More »

దర్యాప్తు మొదలెట్టిన సిట్.. ప్రత్యేక వ్యూహంతో ముందుకు!

తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తులను కలవరపరిచాయి. ఈ అంశం మీద ఏపీలో చెలరేగిన రాజకీయ మంటలు సంగతి పక్కనబెడితే.. అందులో నిజానిజాలు వెలికితీసి, కారకులకు కఠినంగా శిక్షించాలని భక్తుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఆ సేవ కూడా!

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. అక్టోబర్ 1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల ఆలయంలో మంగళవారం (అక్టోబరు 1) రోజున ఆలయ శుద్ధి నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) టీటీడీ రద్దు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించి నిర్వాహకులకు సహకరించాలని …

Read More »

లడ్డూ పెట్టిన మంట.. టీ-బీజేపీ వర్సెస్ వైసీపీ!

ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్​కల సాకారం కావడంలో …

Read More »

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి.. చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల్లో ప్రోటోకాల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండగలుగా ప్రకటించిన సందర్భాల్లో.. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించే అంశంపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను.. సంబంధిత జిల్లా సీనియర్‌ మంత్రి గానీ, దేవాదాయ శాఖ మంత్రి గానీ, ఇంఛార్జ్ మంత్రి గానీ సమర్పిస్తారు. ఈ మేరకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ పండగల సమయంలో ఆలయాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్‌పై …

Read More »

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్.. ఈ బస్సుల్లో టికెట్లపై 10శాతం రాయితీ

ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.. బస్సు టికెట్లపై 10శాతం రాయితీ ఇస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి, వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీని ఇస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆ ఆఫర్ ఉంటుంది.. అయితే ఆదివారం (అప్‌), శుక్రవారం (డౌన్‌)లను మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా రూట్లలో, ఆ బస్సుల్లో ఛార్జీల వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు. …

Read More »

ఏపీలో వాళ్లందరికి రెండు నెలల పింఛన్ కలిపి ఇస్తారు.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారందరికి రెండు నెలలకు కలిపి పింఛన్‌లను పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు, వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు. అయితే ఇప్పటికీ మరికొందరు పింఛన్లు అందుకోలేకపోవడంతో.. వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ …

Read More »