ఆంధ్రప్రదేశ్

లక్షలు డ్రా చేయాలంటూ బ్యాంక్‌కు వచ్చిన వృద్దుడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం,అలాగే సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకు నిదర్శనమే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన. కె.డి.సి.సి. బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి చలసాని పూర్ణ చంద్రరావు అనే 74 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటలు పాటు వేధించారు. వారి ఒత్తిడికి భయపడి సదరు …

Read More »

ఇకపై చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. ఈ కామర్స్‌కు 40 ఆప్కోషో రూమ్‌లు అనుసంధానం

నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు.. ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచింది.  వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం ఇకపై అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ …

Read More »

న్యూసెన్స్‌ చేస్తే జైలులో వేస్తాం.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్

ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సారి డిఫరెంట్‌గా ఫుల్‌ ఖుషీగా.. నవ్వుతూ.. హుషారుగా.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు. జగన్‌ టార్గెట్‌గా పలు ఇంట్రిస్టింగ్‌ కామెంట్స్‌, వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రధానంగా.. వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్‌కు సూచించారు. …

Read More »

ఏటి ఇది.. అసలు ఏటిది.. పొద్దున్నే లేచి చూసేసరికి ఇంటి ముంగిట..

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చోటుచేసుకున్న సంఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. రంగరాయపురంలో ఓ ఇంటి ముందు భయానక దృశ్యం కనిపించింది. ఇంటి ముందు ముగ్గులు వేసి, మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి, మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు, కుంకుమ రాసి భయానక పూజలు జరిగి కనిపించాయి. ఈ దృశ్యం చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పని ఎవరు చేశారు అన్న అనుమానాలు …

Read More »

తిరుమల నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయండి.. హైకోర్టు సంచలన ఆదేశాలు

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక దారిలో శ్రీవారి భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా-WII, అటవీ శాఖ, TTD అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులను నవంబరులోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని TTD ఈవోకి హైకోర్టు స్పష్టం చేసింది. సిఫార్సులను ఏ మేరకు అమలు చేశారో తేల్చే బాధ్యతను సంయుక్త కమిటీకి అప్పగిస్తామని చెప్పింది. మరోవైపు చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 …

Read More »

రానున్న 24 గంటల్లో కుండపోత వాన.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన …

Read More »

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే.

దసరా సెలవుల నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు విమాన ప్యాకేజీ పర్యటనలను ప్రకటించింది. ఈ విషయంపై గురువారం IRCTC/BBS జాయింట్ జనరల్ మేనేజర్ క్రాంతి పి. సావర్కర్ మాట్లాడుతూ.. టూర్ ప్యాకేజీ గురించి అనేక విషయాలు చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఇచ్చే సదుపాయాలను.. సేవలను తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ-క్లాస్ విమాన టిక్కెట్లు, …

Read More »

టీటీడీకి ఎలక్ట్రిక్‌ బస్సు విరాళం.. ధర ఎంతో తెలుసా?

ఆపదమొక్కుల వాడు, కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు నిత్యం విరాళాలు అందజేస్తూ ఉంటారు. కొందరు బంగారు నగలు విరాళంగా సమర్పించుకుంటే మరికొందరు డబ్బును విరాళంగా ఇస్తుంటారు. తాజాగా చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గ‌ణేష్ మ‌ణి, చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫీస‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ్‌ తిరుమల తిరుపతి దేవస్తానానికి ఎలక్ట్రిక్‌ బస్సును విరాళంగా ఇచ్చారు. బుధవారం కంపెనీ పతినిధులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్. అనంతరం రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్‌ బస్సును …

Read More »

మరో 4 రోజుల్లోనే ఏపీపీఎస్సీ FBO ప్రిలిమినరీ 2025 రాత పరీక్ష.. OMRలో ఈ చిన్నతప్పు చేశారో గోవిందా..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో మొత్తం 691 ఫారెస్ట్‌ బీట్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రిలిమినీర రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో ఫారెస్ట్‌ బీట్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీ­సర్స్‌ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ 13 జిల్లాల్లో …

Read More »

సీబీఎస్‌ఈ స్కూల్‌ నిర్వాకం.. పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు మిస్సింగ్‌!

పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో వెలుగు చూసింది… సీబీఎస్సీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన …

Read More »