నిన్నటి మధ్య అండమాన్ సముద్రం ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ప్రాంతంలో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అనగా 14 డిసెంబర్ 2024 ,ఉదయం 0830 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, డిసెంబర్ 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజులలో బాగా గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. …
Read More »అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి.జిల్లాలో రెండు వేరువేరు ఘటనలలో రూ.72.25 లక్షల దొంగ నోట్లను పోలిసులు పట్టుకున్నారు. మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని..శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలిసులు. రెండు వేరువేరు ఘటనలలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. జిల్లాలోని మెలియాపుట్టి, జి.సిగడాం పోలీస్ స్టేషన్లు పరిధిలో మొత్తం రూ. 72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలకు సంబంధించి ఎనిమిది మందిని …
Read More »ఖతర్నాక్ కిలేడీ… ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..
ఒంగోలులో పదినెలల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది… ఇంట్లో పడుకుని ఉన్న బాబును ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్లింది… బాలుడు కిడ్నాపయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడ్ని సంరక్షించారు… బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు… తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు ప్రగతి నగర్‌లో శుక్రవారం పదినెలల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు… ఇంటి దగ్గర ఉన్న బాలుడ్ని అదే కాలనీలో …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా.. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..
ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా …
Read More »ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
బిగ్‌బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. రేపు (డిసెంబర్ 15న) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ముందు నుంచి గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ పోరు హోరా హోరీగా జరుగుతుంది. బిగ్‌బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ …
Read More »కర్మ అంటే ఇదే.. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి మరీ భర్తను చంపింది.. చివరికీ..!
ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు.పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే ఇతరులకు అపకారం చేస్తే తిరిగి అదే అపకారం నీకు లభిస్తుందని అర్ధం..! దీన్నే కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది.. కర్మ రూపంలో తిరిగి ఆమెకే ఆ పాపం అంటుకుంది. దీంతో ఏ పాపం ఎరుగని ఇద్దరు …
Read More »అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు …
Read More »హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు..
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. …
Read More »కొత్త లెక్కలు వేస్తున్న వైసీపీ.. అగ్రనేత వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..?
సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ …
Read More »బెయిల్ నిరాకరణ.. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్
12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ,7 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్య థియేటర్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal